కూతురు గురించి Priyanka Chopra భర్త Nick Jonas ఏమన్నాడంటే...

ABN , First Publish Date - 2022-06-01T01:05:46+05:30 IST

అమెరికన్ మ్యూజీషియన్, ప్రియాంక చోప్రా భర్త నిక్ జోనస్ కూతురు మాల్టీ మారీ గురించి ఆసక్తికరమైన మాటలు చెప్పుకొచ్చాడు. చిన్నారి వారసురాలు జీవితంలోకి వచ్చాక ‘ప్రతీ అంశం తాలూకూ భావోద్వేగంలోని గాఢత పెరిగిం’దని ఆయన అంటున్నాడు. కొన్నాళ్ల క్రితం టెక్సాస్ నగరంలో చోటు చేసుకున్న విషాదకరమైన కాల్పుల ఘటనలో 19 మంది పిల్లలు, ఇద్దరు పెద్దవారు చనిపోవటంపై నిక్ స్సందించాడు...

కూతురు గురించి Priyanka Chopra భర్త Nick Jonas ఏమన్నాడంటే...

అమెరికన్ మ్యూజీషియన్, ప్రియాంక చోప్రా భర్త నిక్ జోనస్ కూతురు మాల్టీ మారీ గురించి ఆసక్తికరమైన మాటలు చెప్పుకొచ్చాడు. చిన్నారి వారసురాలు జీవితంలోకి వచ్చాక ‘ప్రతీ అంశం తాలూకూ భావోద్వేగంలోని గాఢత పెరిగిం’దని ఆయన అంటున్నాడు. కొన్నాళ్ల క్రితం టెక్సాస్ నగరంలో చోటు చేసుకున్న విషాదకరమైన కాల్పుల ఘటనలో 19 మంది పిల్లలు, ఇద్దరు పెద్దవారు చనిపోవటంపై నిక్ స్సందించాడు... 

గతంలో కంటే ఇప్పుడు తన భావోద్వేగాల్లోని గాఢత పెరిగిందన్న నిక్ జోనస్... కుటుంబానికి సాధ్యమైనంత ఎక్కువగా అందుబాటులో ఉంటూ, వీలైనంత అధికంగా ఆలోచిస్తున్నానని వివరించాడు. అంతే కాదు, ఓ తండ్రిగా గొప్ప అనుభూతిని పొందానని చెప్పిన ఆయన కూతురు మాల్టీ మారీ వల్ల జీవితంలో సరికొత్త దృక్కోణం ఆవిష్కృతం అయిందని వ్యాఖ్యానించాడు. 

టెక్సాస్ లో ఈ మధ్య జరిగిన ఘోరమైన కాల్పుల ఘటన గురించి ప్రస్తావిస్తూ... ఒక తండ్రిగా తానసలు ఆ మరణించిన పిల్లల గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నానని నిక్ బాధని వ్యక్తం చేశాడు. మార్పు రావాలని తాను కోరుకుంటున్నట్టు చెప్పిన ప్రియాంక చోప్రా భర్త, ఎన్నో ప్రాణాలు బలిగొంటోన్న గన్ కల్చర్ కి తప్పకుండా అంతం అంటూ ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. 

Updated Date - 2022-06-01T01:05:46+05:30 IST

Read more