RRR పై ప్రశంసలు కురిపించిన అవార్డు విన్నింగ్ హాలీవుడ్ రచయిత.. ఎంతో ఎంజాయ్ చేశానంటూ..
ABN, First Publish Date - 2022-06-14T19:28:30+05:30
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో భారత స్వాతంత్య్ర సమరయోధులు అల్లూరి సీతారాం రాజుగా రామ్ చరణ్, కొమరం భీమ్‌గా..
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో భారత స్వాతంత్య్ర సమరయోధులు అల్లూరి సీతారాం రాజుగా రామ్ చరణ్, కొమరం భీమ్‌గా జూనియర్ ఎన్టీఆర్ నటించిన పాన్ ఇండియా చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. మార్చి 25న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకొని ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్లకు పైగా కలెక్షన్లని కొల్లగొట్టింది. అనంతరం మే 20న ఓటీటీలో విడుదలై అక్కడ కూడా మంచి వ్యూవర్‌షిప్‌ని సాధించింది. కాగా.. ఈ మూవీపై విదేశాలకు చెందిన పలువురు సినీ సెలబ్రిటీలు ప్రశంసలు కురిపిస్తున్న విషయం తెలిసిందే.
తాజాగా టీవీ సిరీస్ ‘అమెరికన్ క్రైమ్ స్టోరీ’ తో గోల్డెన్ గ్లోబ్ వంటి పలు అవార్డులు సాధించిన హాలీవుడ్ రైటర్ లారీ కరాస్జెవ్స్కీ ఈ రాజమౌళి సినిమాపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపించాడు. ట్విట్టర్లో నాటు నాటు సాంగ్‌ని షేర్ చేసిన లారీ కరాస్జెవ్స్కీ.. ‘సినిమా చనిపోయిందని చెప్పే వారి అభిప్రాయం కరెక్టు కాదని RRR చూస్తే తెలుస్తోంది’ అంటూ రాసుకొచ్చాడు. ఆయన పోస్ట్‌కి.. ‘మీ ప్రశంసలకి ధన్యవాదాలు. మీరు కూడా సినిమాను ఆస్వాదించారని ఆశిస్తున్నాం సార్’ అంటూ ఆ సినిమా అధికారిక ఖాతా నుంచి రిప్లై ఇచ్చారు. దానికి.. ‘ప్రతి సెకండ్ని ఎంజాయ్ చేశాను. గత కొన్ని సంవత్సరాల్లో థియేటర్స్‌లో నేను అద్భుతంగా ఫీల్ అయిన సినిమా ఇదే’ అని రిప్లై ఇచ్చాడు.