సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

79 ఏళ్ల కెరీర్... మరి కొద్ది రోజుల్లో 100వ పుట్టిన రోజు... అంతలోనే సీనియర్ మోస్ట్ యాక్ట్రస్ మరణం!

ABN, First Publish Date - 2022-01-01T20:45:21+05:30

మరి కొద్ది రోజుల్లోనే 100వ పుట్టిన రోజు. అంతలోనే తన సుదీర్ఘ జీవితయానం ముగించేసి వెళ్లిపోయింది అమెరికన్ నటి బెట్టీ వైట్. ఆమె మరో మూడు వారాల్లో వందేళ్లు పూర్తి చేసుకోనుండగా డిసెంబర్ 31న లాస్ ఏంజిల్స్ నగరంలో మరణించింది. 99 ఏళ్ల బెట్టీ రెండు రోజుల ముందు కూడా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మరి కొద్ది రోజుల్లోనే 100వ పుట్టిన రోజు. అంతలోనే తన సుదీర్ఘ జీవితయానం ముగించేసి వెళ్లిపోయింది అమెరికన్ నటి బెట్టీ వైట్. ఆమె మరో మూడు వారాల్లో వందేళ్లు పూర్తి చేసుకోనుండగా డిసెంబర్ 31న లాస్ ఏంజిల్స్ నగరంలో మరణించింది. 99 ఏళ్ల బెట్టీ రెండు రోజుల ముందు కూడా జనవరి 17న జరగాల్సిన తన వందో జన్మదినం సంబరాల గురించి ట్వీట్ చేసింది. కానీ, ఆ మైలు రాయి ఒక్కటి అధిగమించకుండానే తుది శ్వాస విడిచింది. 


బెట్టి వైట్ 79 ఏళ్ల పాటూ సినీ, టీవీ రంగాల్లో కొనసాగింది. అమెరికాలో ఆమెని ‘ఫస్ట్ లేడీ ఆఫ్ టెలివిజన్’ అంటారు. బుల్లితెరపై ఆమె కంటే మించిన సుదీర్ఘ కెరీర్ మరెవ్వరికీ లేదు. అదో గిన్నిస్ రికార్డ్ కూడా! ‘ద మేరీ టైలర్ మూరే షో, గోల్డెన్ గాళ్స్’ వంటి అనేక షోస్‌లో ఆమె సంవత్సరాల తరబడి ప్రేక్షకుల్ని అలరించింది. మొత్తంగా ఎనిమిది ఎమ్మీ అవార్డ్స్ వివిధ క్యాటగిరీస్‌లో ఆమెకు దక్కాయి. అమెరికాలో టెలివిజన్ రంగం ప్రారంభమైన నాటి నుంచీ బెట్టి వైట్ కీలక వ్యక్తిగా కొనసాగుతూ వచ్చింది. అందుకే, ఆమెకి యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ ‘కల్చరల్ ఐకాన్‘ అంటూ నివాళులు అర్పించారు...  

Updated Date - 2022-01-01T20:45:21+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!