Amala paul: మళ్లీ పెళ్లి... నిజమేనా?
ABN , First Publish Date - 2022-09-09T22:32:30+05:30 IST
హీరోయిన్ అమలాపాల్ (Amala paul) కెరీర్ పీక్స్‌లో ఉన్నప్నుడు తమిళ దర్శకుడు విజయ్ను ప్రేమించి పెళ్లాడింది. అయితే ఆ వివాహబఽంధం ఎక్కువ కాలం నిలువలేదు. వ్యక్తిగత కారణాల వల్ల విడాకులు తీసుకున్నారు.
హీరోయిన్ అమలాపాల్ (Amala paul) కెరీర్ పీక్స్‌లో ఉన్నప్నుడు తమిళ దర్శకుడు విజయ్ను ప్రేమించి పెళ్లాడింది. అయితే ఆ వివాహబఽంధం ఎక్కువ కాలం నిలువలేదు. వ్యక్తిగత కారణాల వల్ల విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి అమలాపాల్ సింగిల్‌గా ఉంటూ సినిమాలపై దృష్టిపెట్టారు. అయితే ఈ జర్నీలో ఆమె ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంది. నిర్మాతగా మారి పలు ప్రయోగాలు చేశారు. క్యాస్టింగ్ కౌచ్ తదితర విషయాల్లో వివాదాల పాలయ్యారు. కొన్నాళ్లకు అవన్నీ సర్దుమణికి సినిమాలు, సిరీస్‌లతో బిజీ అయ్యారు. తాజాగా తన మాజీ ప్రియుడు భవీందర్ సింగ్‌తో ప్రొడక్షన్ హౌస్ వివాదం, లైంగిక వేధింపులు కేసుతో మద్రాస్‌లో పోలీస్ అరెస్ట్ చేశారు. ఈ వివాదంతో అమలాపాల్ మరోసారి వార్తలోకి వచ్చారు. ఇప్పుడు ఆమెపై మరో రూమర్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. గాయకుడు భవిందర్‌సింగ్ దత్‌ను ఆమె వివాహం చేసుకున్నారనే వార్త హల్చల్ చేస్తోంది. ఆ వార్త నిజమా? అబద్ధమా అంటే అవుననే అంటోంది కోలీవుడ్. (Amala paul second marriage)
పంజాబీ గాయకుడు భవీందర్‌సింగ్ దత్ తనని వేధిస్తున్నాడంటూఇటీవల అతనిపై కేసు పెట్టగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత భవీందర్ బెయిల్ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. 2017లోనే అమలాపాల్‌తో భవీందర్ వివాహం జరిగిందని పేర్కొని సంబంధిత ఆధారాలు ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు సమర్పించారని తెలిసింది. వీటిని పరిశీలించిన న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేసిందని కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. దీంతో అమలాపాల్ రెండో పెళ్లి చేసుకున్న మాట నిజమే కావచ్చని కథనాలు వైరల్ అవుతున్నాయి. రెండేళ్ల క్రితం అమలాపాల్, భవీందర్ సింగ్ సన్నిహితంగా ఉన్న ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఆ తర్వాత కొద్దిరోజులకు ఆ ఫొటోలను సోషల్ మీడియా నుంచి తొలగించారు. ఆ ఫొటోలపై ఓసారి అమలాపాల్ స్పందించారు. అది కేవలం ఫొటోషూట్ అని, పెళ్లి కాదని ఏడాది క్రితం అమలాపాల్ స్టేట్మెంట్ ఇచ్చారు.