సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Amala Paul: సినిమాలకు గుడ్ బై చెప్పాలనుకున్న అందాల భామ.. కారణమేంటంటే..

ABN, First Publish Date - 2022-08-18T22:47:33+05:30

విభిన్న సినిమాలు వైవిధ్య భరిత పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న అందాల భామ అమలా పాల్ (Amala Paul). ‘లవ్ పెయిల్యూర్’, ‘నాయక్’, ‘ఇద్దరమ్మాయిలతో’ వంటి చిత్రాలతో అలరించింది. ఆమె సినీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విభిన్న సినిమాలు వైవిధ్య భరిత పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న అందాల భామ అమలా పాల్ (Amala Paul). ‘లవ్ పెయిల్యూర్’, ‘నాయక్’, ‘ఇద్దరమ్మాయిలతో’ వంటి చిత్రాలతో అలరించింది. ఆమె సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 12ఏళ్లు పూర్తయింది. ఈ నేపథ్యంలో మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో ఆసక్తికర కబుర్లను అభిమానులతో పంచుకుంది. తాను ఒకానొక సమయంలో సినీ ఇండస్ట్రీకి టాటా చెప్పాలనుకున్నానని అమలా పాల్ చెప్పింది. 


‘‘నిజానికీ దూరంగా బతుకుతున్నట్టు నాకు అనిపించింది. ఒక పాత్ర నుంచి మరో పాత్రకు పరిగెడుతూ సక్సెస్ కోసం వెంపర్లాడుతున్నట్టు తోచింది. వర్తమానంలో జీవించడం లేదని నాకనిపించింది. ఆ తర్వాత నాలో నేను ఎంతగానో మదనపడ్డాను. సినిమాలకు గుడ్ చై చెప్పాలనుకున్నాను. నేను పోరాటయోధురాలినని భావించేదానిని. కానీ, మా నాన్న చనిపోయిన సమయంలో నేను ఎన్నో భయాలను ఎదుర్కొన్నాను. కోలుకోవడానికి సమయం తీసుకోవాలని భావించాను. అప్పుడే కొంచెం విరామం తీసుకున్నాను. ప్రస్తుతం నేను ఆత్మ విశ్వాసంతో చెప్పగలను. నేను కోలుకుని పోరాట యోధురాలిగా మారాను’’ అని అమలా పాల్ చెప్పింది. ఇక కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం అమలా పాల్ ‘కడవర్’ (Cadaver) లో నటించింది. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందింది. ఈ మూవీ నేరుగా ‘డిస్నీ+హాట్‌స్టార్’ లో విడుదలైంది. ఈ  సినిమా ఆగస్టు 12 నుంచి ప్రేక్షకులకు అందుబాటులో ఉంది. ఈ మూవీలోని పాత్ర కోసం నిజమైన పోస్ట్ మార్టం చూసినట్టు తాజాగా వెల్లడించింది.

Updated Date - 2022-08-18T22:47:33+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!