సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Nayanthara, Vignesh Shivan పెళ్లి నేడే.. ఇద్దరికీ వయసులో ఎంత తేడా ఉందో.. ఇద్దరిలో ఎవరు పెద్దో తెలిస్తే..

ABN, First Publish Date - 2022-06-09T18:06:11+05:30

గత కొన్ని రోజులుగా వస్తున్న రూమర్స్‌ని నిజం చేస్తూ నటి నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గత కొన్ని రోజులుగా వస్తున్న రూమర్స్‌ని నిజం చేస్తూ నటి నయనతార (Nayanathara), దర్శకుడు విఘ్నేష్ శివన్ (Vignesh Shivan) వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. దాదాపు ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్న ఈ జంట గతేడాది డిసెంబర్‌లో నిశ్చితార్థం చేసుకుంది. అప్పటి నుంచి ఈ కపుల్ మ్యారేజ్ గురించి పలు వార్తలు నెట్టింట హల్‌చల్ చేశాయి. ఈ తరుణంలో పెళ్లి వివరాలు తెలుపుతూ రెండు రోజుల క్రితం ఈ జంట ఓ ఆహ్వాన వీడియోని విడుదల చేసింది. అందులో జూన్ 9న అంటే గురువారం ఉదయం 8.30 గంటలకు పెళ్లి తంతు జరగనున్నట్లు చెప్పుకొచ్చింది. మహాబలిపురంలో జరిగిన వీరి పెళ్లికి పలువురు దక్షిణాది, ఉత్తరాది సినీ ప్రముఖులు హాజరైనట్లు సమాచారం. ఈ తరుణంలో నయనతార, విఘ్నేష్ వయస్సుల మధ్య తేడాపై నెట్టింట చర్చ జరుగుతోంది.


నయనతార బెంగుళూరుకి చెందిన ఓ క్రిస్టియన్ కుటుంబంలో నవంబర్ 18, 1984లో పుట్టింది. అసలు పేరు డయానా మరియమ్ కురియన్. అలాగే.. దర్శకుడు విఘ్నేశ్ శివన్ తమిళనాడుకు చెందిన హిందూ కుటుంబంలో 18 సెప్టెంబర్ 1985లో పుట్టాడు. నయనతార ప్రస్తుత వయస్సు 37 సంవత్సరాలు కాగా.. విఘ్నేష్ వయస్సు 36 సంవత్సరాలు. అంటే నయనతార, విఘ్నేష్ కంటే ఓ ఏడాది పెద్ద కావడం గమనార్హం. ఈ విషయం మీదే ప్రస్తుతం నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇటీవలికాలంలో వయస్సు గురించి పట్టించుకోకుండా వివాహాలు జరగడం మామూలే కదా అని మాట్లాడుకుంటున్నారు.

Updated Date - 2022-06-09T18:06:11+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!