సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

తమిళ దర్శకుల సంఘ అధ్యక్షుడిగా ఆర్‌కె. సెల్వమణి

ABN, First Publish Date - 2022-03-02T02:16:02+05:30

తమిళ చలనచిత్ర దర్శకుల సంఘం ఎన్నికలు ఆదివారం జరిగాయి. కేకే నగరులోని తాయ్‌ సత్య మెట్రిక్యులేషన్‌ స్కూల్‌లో ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరిగింది. పోలింగ్‌ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తమిళ చలనచిత్ర దర్శకుల సంఘం ఎన్నికలు ఆదివారం జరిగాయి. కేకే నగరులోని తాయ్‌ సత్య మెట్రిక్యులేషన్‌ స్కూల్‌లో ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరిగింది. పోలింగ్‌ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఈ ఎన్నికల్లో ప్రముఖ దర్శకుడు ఆర్‌.కె.సెల్వమణి మరోమారు అధ్యక్షుడిగా విజయం సాధించారు. అలాగే, ఆయన సారథ్యంలోని పుదు వసంతం ప్యానెల్‌ తరపున పోటీ చేసిన వారిలో ఒకరిద్దరు మినహా మిగిలిన వారంతా విజయం సాధించారు. ఆర్‌కె. సెల్వమణికి ప్రత్యర్థిగా పోటీచేసిన దర్శకుడు కె. భాగ్యరాజ్‌ ఓటమిపాలయ్యారు. కాగా, ఈ సంఘంలో మొత్తం 2,600 మంది సభ్యులుంటే, ఓటు హక్కు మాత్రం 1,900 మందికి మాత్రమే ఉంది. 


ఆదివారం జరిగిన పోలింగ్‌లో పోస్టల్‌ ఓట్లతో కలుపుకుని మొత్తం 1521 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. రిటర్నింగ్‌ అధికారి సెంథిల్‌నాధన్‌ నేతృత్వంలో పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం పోలైన 1521 ఓట్లలో సెల్వమణికి 955 ఓట్లు, భాగ్యరాజ్‌కు 566 ఓట్లు వచ్చాయి. దీంతో 389 ఓట్ల తేడాతో ఆర్‌.కె. సెల్వమణి విజయం సాధించారు. దీంతో ఆయన మరోమారు తమిళ చలనచిత్ర దర్శకుల సంఘ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా ఆర్‌.వి.ఉదయకుమార్‌, కోశాధికారిగా పేరరసు ఎన్నికయ్యారు. అలాగే, ఆయన ప్యానెల్‌ తరపున ఉపాధ్యక్షులుగా పోటీ చేసిన దర్శకులు ఎళిల్‌, మాదేష్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Updated Date - 2022-03-02T02:16:02+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!