ధనుష్ అభిమానుల ఆశలపై నీళ్లు చల్లిన ఐశ్వర్య

ABN , First Publish Date - 2022-03-25T02:07:46+05:30 IST

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు ఐశ్వర్య, హీరో ధనుష్‌తో విడాకులు

ధనుష్ అభిమానుల ఆశలపై నీళ్లు చల్లిన ఐశ్వర్య

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు ఐశ్వర్య, హీరో ధనుష్‌తో విడాకులు తీసుకుంటున్నట్టు ఈ ఏడాది జనవరి 17న ప్రకటించిన సంగతి తెలిసిందే. 18ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్టు వీరిద్దరూ సోషల్ మీడియాలో వేర్వేరుగా వెల్లడించారు. ఈ ప్రకటన అనంతరం వీరిద్దరూ తమ పనుల్లో బిజీ అయ్యారు. 


భార్యాభర్తలుగా తాము విడిపోతున్నట్టు ప్రకటించిన కొన్ని నెలల అనంతరం ఐశ్వర్య తన సోషల్ మీడియా అకౌంట్‌ల నుంచి ధనుష్ పేరును తొలగించింది. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో తన పేరును ఐశ్వర్య రజినీకాంత్‌గా ఆమె మార్చుకుంది.  కాగా..ఐశ్వర్య, ధనుష్ మరల కలుస్తారని ఎంతో మంది ఆశించారు. వారి ఆశలపై నీళ్లు చల్లుతూ ఐశ్వర్య పేరు మార్చుకోవడంతో ధనుష్ అభిమానులందరూ షాక్ అయ్యారు. ఐశ్వర్య, ధనుష్ విడాకులపై గతంలో అతడి తండ్రి కస్తూరి రాజా స్పందించాడు. వారిద్దరిని  కలిపేందుకు తాను ప్రయత్నిస్తున్నట్టు చెప్పాడు. ‘‘భార్యాభర్తల మధ్య గొడవలు అనేది చాలా సాధారణమైన విషయం. వీరిద్దరి మధ్య చిన్న చిన్న కుటుంబ కలహాలు చోటు చేసుకున్నాయి. వారికి నచ్చ జెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఇప్పటికే వాళ్లద్దరితో ఫోన్‌లో మాట్లాడాను. ఆ జంటకు సర్దిజెప్పడానికి ప్రయత్నిస్తా’’ అని కస్తూరి రాజా అప్పట్లో అన్నాడు.

Updated Date - 2022-03-25T02:07:46+05:30 IST