Aditi Prabhudeva: వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన మరో నటి.. వరుడెవరంటే..

ABN , First Publish Date - 2022-11-29T17:21:43+05:30 IST

ప్రముఖ కన్నడ నటి అదితి ప్రభుదేవా (Aditi Prabhudeva) వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. బెంగళూరు ప్యాలెస్‌ మైదానంలో నవంబర్ 28న ఈ నటి..

Aditi Prabhudeva: వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన మరో నటి.. వరుడెవరంటే..

ప్రముఖ కన్నడ నటి అదితి ప్రభుదేవా (Aditi Prabhudeva) వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. బెంగళూరు ప్యాలెస్‌ మైదానంలో నవంబర్ 28న ఈ నటి ప్రముఖ వ్యాపారవేత్త యషస్‌ పట్లా (Yashas Patla)తో కలిసి ఏడు అడుగులు వేశారు. ఎంతోమంది కన్నడ స్టార్స్, సినీరంగ ప్రముఖులతో పాటు రాజకీయనేతలు కూడా హాజరై ఆశీర్వదించారు. వివాహ కార్యక్రమానికి సన్నిహితులు, సినీరంగ ప్రముఖులను మాత్రమే ఆహ్వానించారు.


కాగా.. ఈ వివాహానికి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైతో పాటు కేజీయఫ్ ఫేమ్ యశ్ (Yash), ఆయన భార్య రాధిక పండిట్, జై జగదీశ్, రచన ఇందర్, అభిషేక్ అంబరీష్, మేఘనా రాజ్ సర్జా వంటి పలువురు ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన ఫొటోలను అదితి సోషల్‌మీడియాలో పోస్టు చేసి అభిమానులతో తన సంతోషాన్ని పంచుకున్నారు. ఈ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.









Updated Date - 2022-11-29T17:21:43+05:30 IST