నాగచైతన్య ఇంటికి గుడ్ బై చెప్పి.. సినిమా సెట్లోనే నివసిస్తున్న సమంత.. అందుకు కారణమేంటంటే..

ABN , First Publish Date - 2022-03-17T21:27:39+05:30 IST

నాగచైతన్యతో విడాకుల అనంతరం వరుస సినిమాలతో

నాగచైతన్య ఇంటికి గుడ్ బై చెప్పి.. సినిమా సెట్లోనే నివసిస్తున్న సమంత.. అందుకు కారణమేంటంటే..

నాగచైతన్యతో విడాకుల అనంతరం వరుస సినిమాలతో దుసుకుపోతోన్న కథానాయిక సమంత. పాన్ ఇండియా ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తూ ఫుల్ బిజీగా ఉంది. ‘శాకుంతలం’, ‘యశోద’, ‘అరేంజ్ మెంట్స్ ఆఫ్ లవ్’ వంటి మూవీస్‌తో క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. అయితే, సామ్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో ప్రస్తుతం హల్ చల్ చేస్తుంది. అదేంటంటే..


సమంత ప్రస్తుతం హైదరాబాద్‌లోనే నివసిస్తోంది. కాకపోతే ఆమె ఉంటోన్న ఇంటిలో నాగచైతన్యకు కూడా వాటా ఉందట. విడాకుల అనంతరం కూడా ఆమె అదే ఇంటిలో నివాసం ఉంటోంది. కానీ, సామ్ ఇప్పుడు తన హైద్రాబాద్ హౌజ్‌కి తాత్కాలికంగా గుడ్ బై చెప్పిందని పుకార్లు షికార్లు కొడుతున్నాయి. ‘యశోద’ సినిమా కోసం వేసిన సెట్లను చూసి సమంత ఆశ్యర్యపోయిందట. ఈ సెట్లు అన్ని ఫైవ్‌స్టార్ హోటల్ లాగా ఉండటంతో సెట్లోనే కొన్ని రోజులు నివసించాలని ఆమె నిర్ణయించుకుందని సమాచారం. ఆలస్యం కాకుండా షూటింగ్ కూడా త్వరగా పూర్తి చేయొచ్చని సమంత భావిస్తుందని.. అందువల్లే సామ్ ఈ నిర్ణయం తీసుకుందని ఆమె‌తో సన్నిహితంగా మెలిగే వ్యక్తులు తెలుపుతున్నారు. ‘యశోద’ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్‌గా అశోక్ కోరలత్ పనిచేస్తున్నారు. ఈ సినిమా కోసం అతడు మూడు నెలలు కష్టపడి దాదాపు 200మందితో భిన్నమైన సెట్లు వేశాడు. 


‘యశోద’ పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోంది. హరి- హరీష్ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.Updated Date - 2022-03-17T21:27:39+05:30 IST

Read more