సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Lokesh Kanagaraj, Thalapathy Vijay సినిమాలో పోలీస్ పాత్రలో సమంత.. Vikram కు కొనసాగింపుగానేనా..!?

ABN, First Publish Date - 2022-07-02T22:11:34+05:30

‘మా నగరం’, ‘ఖైదీ’, ‘మాస్టర్’ వంటి సినిమాలకు దర్శకత్వం వహించి బంపర్ హిట్ కొట్టిన దర్శకుడు లోకేశ్ కనకరాజ్ (Lokesh Kanagaraj). తాజాగా కమల్ హాసన్ నటించిన ‘విక్రమ్’ (Vikram) కు దర్శకత్వం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘మా నగరం’, ‘ఖైదీ’, ‘మాస్టర్’ వంటి సినిమాలకు దర్శకత్వం వహించి బంపర్ హిట్ కొట్టిన దర్శకుడు లోకేశ్ కనకరాజ్ (Lokesh Kanagaraj). తాజాగా కమల్ హాసన్ నటించిన ‘విక్రమ్’ (Vikram) కు దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ అయింది. వరల్డ్ వైడ్‌గా రూ. 400కోట్ల వసూళ్లను రాబట్టింది. లోకేశ్ తన తర్వాతి ప్రాజెక్టును స్టార్ హీరో విజయ్‌తో చేయనున్నాడు. అందుకు సంబంధించిన స్క్రిఫ్ట్ వర్క్ ప్రస్తుతం జరుగుతుంది. మరికొద్ది రోజుల్లోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంంది. ఈ సినిమాకు ‘దళపతి-67’ అని వర్కింగ్ టైటిల్‌ పెట్టారు. ఈ సినిమా‌కు సంబంధించి కోలీవుడ్ మీడియాలో ఓ పుకారు షికారు కొడుతుంది.


‘దళపతి-67’ లో స్టార్ హీరోయిన్ సమంత (Samantha) నటించనుందని వదంతులు హల్‌‌చల్ చేస్తున్నాయి. పోలీస్ పాత్రలో సామ్ కనిపించనుందట. విజయ్ గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించనున్నాడని సమాచారం. ‘విక్రమ్’ సినిమాకు కొనసాగింపుగా ‘దళపతి-67’ తెరకెక్కనుందని తెలుస్తుంది. ‘విక్రమ్’ కు పనిచేసిన చిత్ర బృందమే ఈ సినిమాకు పనిచేయనుంది. సెవెన్ స్క్రీన్ స్టూడియో నిర్మించనుంది. అక్టోబర్‌లో మూవీ షూటింగ్‌ను ప్రారంభిస్తారని తెలుస్తోంది. లోకేశ్ సన్నిహిత మిత్రుడు రత్న కుమార్ అడిషనల్ స్క్రీన్‌ప్లేను అందిస్తున్నారు. గతంలో లోకేశ్ దర్శకత్వం వహించిన ‘మాస్టర్’, ‘విక్రమ్’ సినిమాలకు ఆయన అడిషనల్ స్క్రీన్ ప్లేను అందించిన సంగతి తెలిసిందే. 

Updated Date - 2022-07-02T22:11:34+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!