సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

నిక్‌తో పెళ్లై మూడేళ్లు.. పిల్లల గురించి Priyanka Chopra ఏమందో తెలుసా..

ABN, First Publish Date - 2022-01-14T17:05:54+05:30

బాలీవుడ్‌లో వరుసగా టాప్ హీరోలతో సినిమాలు చేసి టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది ప్రియాంక చోప్రా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్‌లో వరుసగా టాప్ హీరోలతో సినిమాలు చేసి టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది ప్రియాంక చోప్రా. ఈ బ్యూటీ ప్రస్తుతం హలీవుడ్‌లో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే 2018లో పాప్ సింగర్ నిక్ జోనాస్‌ని వివాహం చేసుకుంది ఈ భామ. మ్యారేజ్ అయి మూడేళ్లు అయిన ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పిల్లల గురించి మాట్లాడింది ప్రియాంక.


ఒక హాలీవుడ్ పోర్టల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. భవిష్యత్తులో తల్లి కావాలని ఎదురు చూస్తున్నానని, అది జరిగినప్పుడు తమ జీవితాల్లో జరిగే మార్పులను ఎంజాయ్ చేయడానికి నిక్‌తో పాటు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.


పిల్లలు లైఫ్‌లో ఓ భాగం మాత్రమే కాదని, అంతకుమించి వారికి ప్రాముఖ్యత ఉందని పేర్కొంది. అంతేకాకుండా వారిద్దరూ చాలా పనిలో చాలా బిజీగా ఉన్నారు కదా అని అడగగా.. తాము అంతా బిజీగా లేమని కొంచెం బోల్డ్‌గానే సమాధానం ఇచ్చింది ఈ భామ.

Updated Date - 2022-01-14T17:05:54+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!