సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

మలయాళీ నటుడి ఫొటోను ప్రచురించినందుకు వివాదంలో చిక్కుకున్న మ్యాగజైన్

ABN, First Publish Date - 2022-01-09T21:43:34+05:30

మలయాళీ నటుడి ఫొటోను ప్రచురించినందుకు కేరళకు చెందిన ఒక మ్యాగజైన్ విమర్శలపాలైంది. ఆ మ్యాగజైన్‌పై మహిళలందరు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మలయాళీ నటుడి ఫొటోను ప్రచురించినందుకు కేరళకు చెందిన ఒక మ్యాగజైన్ విమర్శలపాలైంది. ఆ మ్యాగజైన్‌పై మహిళలందరు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. వివాదానికి కారణమైన ఫొటో ఏంటీ..ఆ మ్యాగజైన్‌ను మహిళలు ఎందుకు విమర్శిస్తున్నారు..అవన్ని తెలుసుకొవాలంటే స్టోరీని చదివేయండి.. కేరళకు చెందిన మ్యాగజైన్ ‘‘ వనిత ’’.  తాజాగా ఆ మ్యాగజైన్ జనవరి 2022 ఇష్యూను జారీ చేసింది. హీరో దిలీప్ కుటుంబం ఫొటోను ఆ మ్యాగజైన్ కవర్ పేజిపై ప్రచురించింది. తన భార్య కావ్య మాధవన్, ఇద్దరు కూతుళ్లతో పాటు దిలీప్ ఆ కవర్ పేజిపై కనిపించారు. మీటూ ఉద్యమంలో ఆరోపణలు ఎదుర్కొన్న దిలీప్‌ ఫొటోను ఎలా ప్రచురిస్తారని సెలెబ్రిటీలందరు ప్రశ్నిస్తున్నారు. 

 

మలయాళీ నటుడైన దిలీప్ ఒక నటిని లైంగిక వేధింపులకు గురిచేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు . ‘‘ మాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఒక నటిని  2017, ఫిబ్రవరిలో ఆయన అపహరించారు. కొంత మంది వ్యక్తులతో కలిసి ఆమెను లైంగిక వేధింపులకు గురిచేశారు. దిలీపే ఈ ఘటనకు సూత్రధారి ’’ అని మాలీవుడ్  మీడియాలో కథనాలు వెలువడ్డాయి.  మ్యాగజైన్ కవర్ పేజి వెలువడగానే.. గతంలో మలయాళ నటిని దిలీప్‌ లైంగిక వేధింపులకు గురి చేశారని దర్శకుడైన బాలచంద్ర కుమార్ తాజాగా ఆరోపించారు. 


ఆ కవర్ పేజి వెలువడగానే అనేక మంది సెలెబ్రిటీలు ఆ మ్యాగజైన్‌ను విమర్శించడం మొదలు పెట్టారు. ‘‘ మలయాళీ నటిని దిలీప్ 2017లో కిడ్నాప్ చేశారు. కొన్ని నెలలు జైల్లో గడిపారు. ప్రస్తుతం బెయిల్ మీద బయట ఉన్నారు. నిందితుడు న్యాయాన్ని కోరుతూ కేరళ సీఎంకు లేఖ రాశారు. వనిత మ్యాగజైన్ సిగ్గుపడాలి ’’ అని బాలీవుడ్ నటి స్వర భాస్కర్ తెలిపారు. కొంత మంది దర్శకులు, నటులు మాత్రం మ్యాగజైన్‌కు అండగా నిలిచారు. సాండ్రా థామస్, అరుణ్ గోపి, అరుణ్ గోపి మ్యాగజైన్ కు అనుకూలంగా తమ గళం విప్పారు.

Updated Date - 2022-01-09T21:43:34+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!