సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

94వ ఆస్కార్ పురస్కార విజేతలు వీరే !

ABN, First Publish Date - 2022-03-28T15:57:49+05:30

ఆస్కార్ అవార్డు అందుకోవడం ఎవరికైనా పెద్దకల. ఒక్కసారి ఆ అవార్డును ముద్దాడి మురిసిపోవాలని ఎంతోమంది భావిస్తుంటారు. ఈ ప్రపంచాన్నే జయించినంత సంతోషాన్నిచ్చే ఆ పురస్కారం ప్రతి ఒక్కరికి ఒక వేడుకలాంటిది. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్ అవార్డుల మహోత్సవం.. కరోనా కారణంగా గత రెండేళ్ళలోనూ ప్రేక్షకులు లేక చాలా చప్పగా సాగింది. ఇచ్చే వారు, పుచ్చుకొనే వారే తప్ప.. ఆ వేడుకను తనివితీరా తిలకించే వారే కరువయ్యారు. అయితే ఈ సారి మాత్రం ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ లో ఆస్కార్ అవార్డుల వేడుక సోమవారం ఉదయం చాలా గ్రాండ్ గా మొదలైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆస్కార్ అవార్డు అందుకోవడం ఎవరికైనా పెద్దకల. ఒక్కసారి ఆ అవార్డును ముద్దాడి మురిసిపోవాలని ఎంతోమంది భావిస్తుంటారు. ఈ ప్రపంచాన్నే జయించినంత సంతోషాన్నిచ్చే ఆ పురస్కారం ప్రతి ఒక్కరికి ఒక వేడుకలాంటిది. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్ అవార్డుల మహోత్సవం.. కరోనా కారణంగా గత రెండేళ్ళలోనూ ప్రేక్షకులు లేక చాలా చప్పగా సాగింది. ఇచ్చే వారు, పుచ్చుకొనే వారే తప్ప.. ఆ వేడుకను తనివితీరా తిలకించే వారే కరువయ్యారు. అయితే ఈ సారి మాత్రం ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ లో ఆస్కార్ అవార్డుల వేడుక సోమవారం ఉదయం చాలా గ్రాండ్ గా మొదలైంది. 

సెలబ్రిటీస్, ప్రేక్షకుల సమక్షంలో విజేతల్ని ప్రకటించారు ఆస్కార్ అవార్డుల నిర్వాహకులు. ఈ పోటీల్లో ‘డ్యూన్, చైల్డ్ ఆఫ్ డెఫ్ అడల్ట్స్’ (కోడా) సినిమాలు సత్తా చాటాయి. ఈ రెండు సినిమాలు మూడేసి విభాగాల్లో అవార్డుల్ని కైవసం చేసుకున్నాయి. ఇక బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ విభాగంలో పోటీ పడిన ఇండియన్ చిత్రం ‘రైటింగ్ విత్ ఫైర్’ కి నిరాశే ఎదురైంది. ఈ అవార్డ్ ను ‘సమ్మర్ ఆఫ్ సోల్’ ఎగరేసుకుపోయింది. 

ఆస్కార్ పురస్కార విజేతలు వీరే 

ఉత్తమ చిత్రం : చైల్డ్ ఆఫ్ డెత్ అడల్ట్స్ 

ఉత్తమ నటుడు : విల్ స్మిత్ (కింగ్ రిచర్డ్ )

ఉత్తమ నటి : జెస్సికా చెస్టేన్ (ద ఐస్ ఆఫ్ టామీ ఫే)

ఉత్తమ దర్శకుడు : ద పవర్ ఆప్ ద డాగ్ (జేన్ కాంపియన్)

ఉత్తమ సహాయనటి : అరియానా డిబోస్ (వెస్ట్ సైడ్ స్టోరీ)

ఉత్తమ సహాయనటుడు : ట్రాయ్ కోట్సర్ (కోడా)

ఉత్తమ సినిమాటోగ్రఫీ : గ్రెగ్ ఫ్రెజర్ (డ్యూన్ )

బెస్ట్ ఒరిజినల్ సాంగ్ : నో టైమ్ టు డై 

బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ : సమ్మర్ ఆఫ్ సోల్

బెస్ట్ అడాప్టెడ్ స్ర్కీన్ ప్లే : కోడా (షాన్ హెడర్)

బెస్ట్ ఒరిజినల్ స్ర్కీన్ ప్లే : బెల్ ఫాస్ట్ (కెన్నత్ బ్రానా)

బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ : జెన్నీ బీవన్ (క్రూయెల్లా)

బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ : డ్రైవ్ మై కార్ (జపాన్)

బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ : ఎన్ కాంటో 

బెస్ట్ ఒరిజినల్ స్కోర్ : హన్స్ జిమ్మర్ (డ్యూన్ )

బెస్ట్ విజువల్ ఎఫెక్స్ట్ : (పాల్ లాంబర్ట్ , ట్రిస్టన్ మైల్స్,  బ్రియన్ కానర్, గెర్డ్ నెఫెజర్ )

బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ : జో వాకర్ (డ్యూన్)

బెస్ట్ సౌండ్ : డ్యూన్ (మార్క్ రుత్, మార్క్ మాంగిని, థియో గ్రీన్, డగ్ హెంఫిల్, రాన్ బార్ట్ లెట్)

బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ : డ్యూన్ (ప్రొడక్షన్ డిజైన్ - పాట్రన్ వెర్మట్, సెట్ డెకరేషన్ - జుజానా సిఫోస్)

బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్ : ద ఐస్ ఆఫ్ ద టామీ ఫే (లిండా డౌడ్స్, స్టెఫానీ ఇన్ గ్రామ్, జస్టిన్ రాలే)

బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ : ది లాంగ్ గుడ్ బై

బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ : ది విండ్ షీల్డ్ వైపర్

బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ : ది క్వీన్ ఆఫ్ బాస్కెట్ బాల్ 

Updated Date - 2022-03-28T15:57:49+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!