థియేటర్స్‌లో విడుదలైన రోజు ఉచిత టికెట్స్.. నయా ఓటీటీ సరికొత్త ప్రయోగం
ABN , First Publish Date - 2022-01-20T02:46:03+05:30 IST
అమెరికాకు చెందిన ఎమోషనల్ ఎంటర్‌టైన్మెంట్ కొత్తగా థియేటర్‌హుడ్స్ డాట్ కామ్ పేరుతో సరికొత్త ఓటీటీ ఫ్లాట్‌ఫాంను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఓటీటీ సేవలు ఈ నెల 15, సంక్రాంతి నుంచే అందుబాటులోకి వచ్చినట్టు థియేటర్‌వుడ్స్

అమెరికాకు చెందిన ఎమోషనల్ ఎంటర్‌టైన్మెంట్ కొత్తగా థియేటర్‌హుడ్స్ డాట్ కామ్ పేరుతో సరికొత్త ఓటీటీ ఫ్లాట్‌ఫాంను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఓటీటీ సేవలు ఈ నెల 15, సంక్రాంతి నుంచే అందుబాటులోకి వచ్చినట్టు థియేటర్‌వుడ్స్ డాట్ కామ్ ఇండియా రీజియన్ మార్కెటింగ్ హెడ్ ప్రసాద్ వశీకరన్ వెల్లడించారు. దీనిపై ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. భారతీయ సినీ ప్రేక్షకులను బాగా అర్థం చేసుకుని, వారిని మరింతగా ఆనందింపజేసేందుకు వీలుగా ఈ ఫ్లాట్‌ఫాంను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు ఆయన చెప్పారు. అంతర్జాతీయ స్థాయి నాణ్యతా ప్రమాణాలతో కూడిన సేవలతో పాటు భారతీయ భాషల్లో వెయ్యికి పైగా ఒరిజినల్ సినిమాలు, సిరీస్‌లు అందుబాటులో ఉంచామని, ఇవి ఖచ్చితంగా భారతీయ సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తాయన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.
ముఖ్యంగా అనేక పెద్ద సినిమాలు ఓటీటీలో రిలీజ్ చేసేందుకు కనీసం 30 నుంచి 45 రోజుల పాటు వేచి చూడాల్సిన పరిస్థితి ఉందన్నారు. కానీ, తమ ఓటీటీ ఫ్లాట్‌ఫాం వినియోగదారులకు ఈ కొత్త సినిమాలు థియేటర్‌లో చూసేందుకు వీలుగా ఉచిత టిక్కెట్లను కూడా అందజేస్తామని వెల్లడించారు. ఇందుకోసం స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు థియేటర్‌హుడ్స్ డాట్ కాం సబ్‌స్ర్కైబ్ చేసుకోవాల్సి ఉందని ఆయన వెల్లడించారు. ఈ ఓటీటీ ఫ్లాట్‌ఫాం ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రముఖ సీనియర్ సినీ పీఆర్వో కలైమామణి నెల్లై సౌందర్‌రాజన్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.