Iravatham: హాట్ స్టార్‌లో వీర కుమ్ముడు కుమ్ముతోన్న చిన్న సినిమా

ABN , First Publish Date - 2022-12-31T23:54:23+05:30 IST

ఒక చిన్న సినిమాకి, బలమైన కథనానికి దక్కిన సత్కారం 100 మిలియన్స్ అండ్ ఫిఫ్టీ థౌసండ్ వ్యూయింగ్ మినిట్స్ అంటున్నారు ‘ఐరావతం’ (Iravatham) చిత్రబృందం. ఎస్తేర్ నొరోన్హా, తన్వి నెగ్గి...

Iravatham: హాట్ స్టార్‌లో వీర కుమ్ముడు కుమ్ముతోన్న చిన్న సినిమా

ఒక చిన్న సినిమాకి, బలమైన కథనానికి దక్కిన సత్కారం 100 మిలియన్స్ అండ్ ఫిఫ్టీ థౌసండ్ వ్యూయింగ్ మినిట్స్ అంటున్నారు ‘ఐరావతం’ (Iravatham) చిత్రబృందం. ఎస్తేర్ నొరోన్హా, తన్వి నెగ్గి, అమర్ దీప్, అరుణ్, సప్తగిరి నటించిన ‘ఐరావతం’ చిత్రం ఓటీటీలో ఊహించని ఆదరణ దక్కించుకుంటోంది. ఇండియాలోనే అతిపెద్ద బిగ్గెస్ట్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌ (disney plus hotstar)లో నవంబర్ 17న విడుదలైన ఈ ఫ్యూజన్ డ్రామా చిత్రం.. సైలెంట్‌గా సంచలనాలను సృష్టిస్తోంది. ఆడియెన్స్ ఆద‌ర‌ణ పొందుతూ ఒక నెలలో 100 మిలియన్ అండ్ ఫిఫ్టీ తౌసండ్ వ్యూయింగ్ మినిట్స్‌ను ఈ చిత్రం సాధించింది. సినిమాకు వస్తోన్న ఈ ట్రెమండస్ స్పందనతో.. టీమ్ అంతా క‌లిసి సక్సెస్ పార్టీని సెల‌బ్రేట్ చేసుకుంది. త్వరలోనే ఐరావతం ద్విముఖం (పార్ట్ 2)ను తెరకెక్కించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. నూజివీడు టాకీస్‌ (Nuzvid Talkies) బ్యానర్‌పై రేఖ పలగాని సమర్పణలో రాంకీ పలగాని, బాలయ్య చౌదరి చల్లా, లలిత కుమారి తోట ఈ చిత్రాన్ని నిర్మించారు.

కథ విషయానికి వస్తే.. శ్లోక అనే బ్యూటీషియన్‌కి బర్త్ డే రోజు ఒక వైట్ కెమెరా గిఫ్ట్‌గా వస్తుంది. అప్పటి నుంచి ఆమె లైఫ్ తలక్రిందులు అవుతుంది. బర్త్ డే వీడియోలు తీస్తే డెత్ డే వీడియోలు వస్తుంటాయి. అందులో ఇష్యూస్ డీకోడ్ చేసే క్రమంలో ఎన్నో రహస్యాలు బయట పడుతుంటాయి. ఆ రహస్యాల అల్లికే ఐరావతం అనే తెల్ల కెమెరా కథ. కథా గమనంలో ఒకటి ఊహిస్తే.. క్షణ క్షణానికి అది మారిపోతుంటుంది. క‌థానాయ‌కుడు పెళ్లి చేసుకోవాల‌నుకున్న‌ పెళ్లి కూతురు త‌న ప్రేమికుడితో వెళ్లిపోతుంది. అనంతరం ఈ క‌థ ఎలాంటి మ‌లుపులు తీసుకుంద‌నేదే సినిమా. గుణశేఖర్ శిష్యుడు సుహాస్ మీరా ఈ చిత్రానికి దర్శకుడు.

Updated Date - 2022-12-31T23:59:47+05:30 IST