సుమంత్ ‘మళ్ళీ మొదలైంది’.. డైరెక్ట్ ఓటీటీ రిలీజ్

ABN , First Publish Date - 2022-01-21T02:52:55+05:30 IST

టీజీ కీర్తి కుమార్ దర్శకత్వంలో.. ఈడీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రాజశేఖర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. విడాకులు తీసుకున్న ఓ యువకుడు, తన న్యాయవాదితో ప్రేమలో పడితే?.. అనే కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. ఇందులో సుమంత్ భార్యగా

సుమంత్ ‘మళ్ళీ మొదలైంది’.. డైరెక్ట్ ఓటీటీ రిలీజ్

సుమంత్ హీరోగా నటించిన ‘మళ్ళీ మొదలైంది’ చిత్రం నేరుగా ఓటీటీలోనే విడుదల కానుందని ‘జీ 5’ ఓటీటీ అధికారికంగా ప్రకటించింది. టీజీ కీర్తి కుమార్ దర్శకత్వంలో.. ఈడీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రాజశేఖర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. విడాకులు తీసుకున్న ఓ యువకుడు, తన న్యాయవాదితో ప్రేమలో పడితే?.. అనే కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. ఇందులో సుమంత్ భార్యగా వర్షిణీ సౌందర్ రాజన్, న్యాయవాది పాత్రలో ముఖ్య కథానాయికగా నైనా గంగూలీ నటించారు. ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్ మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. 


ఓటీటీ రైట్స్ దక్కించుకున్న ‘జీ 5’ ఓటీటీ.. ఫిబ్రవరిలో ఈ చిత్రాన్ని ఎక్స్‌క్లూజివ్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా ప్రకటించింది. ఈ సినిమాతో పాటు మరికొన్ని చిత్రాలను కూడా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా ‘జీ 5’ సంస్థ వెల్లడించింది. కాగా, ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించగా.. చరణ్ తేజ్ ఉప్పలపాటి సీఈవోగా వ్యవహరించారు.

Updated Date - 2022-01-21T02:52:55+05:30 IST