సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Oke Oka jeevitham: ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

ABN, First Publish Date - 2022-10-10T23:48:51+05:30

శర్వానంద్‌ (Sharwanand) హీరోగా నటించిన సినిమా ‘ఒకే ఒక జీవితం’ (Oke Oka jeevitham). శ్రీ కార్తిక్ (Shree Karthick) దర్శకత్వం వహించాడు. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో రూపొందించాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శర్వానంద్‌ (Sharwanand) హీరోగా నటించిన సినిమా ‘ఒకే ఒక జీవితం’ (Oke Oka jeevitham). శ్రీ కార్తిక్ (Shree Karthick) దర్శకత్వం వహించాడు. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో రూపొందించాడు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మించింది. రీతూ వర్మ (Ritu Varma) హీరోయిన్‌గా నటించింది. అక్కినేని అమల, వెన్నెల కిశోర్‌, ప్రియదర్శి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా తెలుగు, తమిళ్‌లో తెరకెక్కింది. ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 9న విడుదల అయింది. అభిమానుల మెప్పుతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కించుకుంది. ఈ సినిమాను థియేటర్‌లో మిస్ అయిన వారంతా ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ప్రేక్షకుల ఎదురు చూపులకు తెర దించుతూ ఓటీటీ ప్లాట్‌ఫామ్ స్ట్రీమింగ్ డేట్‌ను ప్రకటించింది. 


‘ఒకే ఒక జీవితం’ డిజిటల్ రైట్స్‌ను సోనీ లీవ్ భారీ ధర చెల్లించి సొంతం చేసుకుంది. ఈ చిత్రం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అక్టోబర్ 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ్‌లో అందుబాటులో ఉండనుంది. స్ట్రీమింగ్ డేట్‌ను డిజిటల్ ప్లాట్‌ఫామ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ‘‘జీవితం రెండో అవకాశం ఇస్తే విధి రాతను మార్చుకోగలమా? శర్వానంద్, రీతూ వర్మ, అమల నటించిన ‘ఒకే ఒక జీవితం’ ఈ నెల 20 నుంచి మీ సోనీ LIV లో స్ట్రీమింగ్ కానుంది’’ అని ఓటీటీ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో మెసేజ్‌ను పోస్ట్ చేసింది. ‘ఒకే ఒక జీవితం’ విడుదలకు ముందు శర్వాకు వరుసగా ప్లాఫ్‌లు వచ్చాయి. అందువల్ల ప్రీ రిలీజ్ బిజినెస్ సరిగ్గా జరగలేదు. శాటిలైట్, ఓటీటీ రైట్స్‌ను ఎవరు కొనుగోలు చేయలేదు. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదల అయిన ఈ చిత్రానికి  ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. విమర్శకులందరు పాజిటివ్ రివ్యూస్‌ను ఇచ్చారు. దీంతో ఓటీటీ ప్లాట్‌ఫాం సోనీ లీవ్ (Sonyliv) డిజిటల్ రైట్స్‌ను భారీ ధర చెల్లించి కొనుగోలు చేసింది.



Updated Date - 2022-10-10T23:48:51+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!