సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ఓటీటీలోకి వచ్చేస్తున్న రానా కొత్త మూవీ..

ABN, First Publish Date - 2022-02-04T13:45:30+05:30

రానా హీరోగా నటించిన కొత్త చిత్రం ‘1945’. ఈ మూవీ గత నెల 7న థియేటర్లలో విడుదలై ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. సత్య శివ దర్శకత్వంలో పీరియాడిక్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రానా హీరోగా నటించిన కొత్త చిత్రం ‘1945’. ఈ మూవీ గత నెల 7న థియేటర్లలో విడుదలై ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. సత్య శివ దర్శకత్వంలో పీరియాడిక్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుందని మేకర్స్ ప్రకటించారు. ఈ నెల 7 నుంచి సన్‌నెక్స్ట్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ మూవీలో రానా సరసన హీరోయిన్‌గా రెజీనా కసాండ్రా నటించింది. సి.కళ్యాణ్ నిర్మించిన ఈ మూవీకి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ఇక రానా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించిన మల్టీస్టారర్ మూవీ ‘భీమ్లా నాయక్’ రిలీజ్‌కు రెడీ అవుతోంది. అలాగే, నారా - సాయి పల్లవి - ప్రియమణి ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న  ‘విరాట పర్వం’ రిలీజ్ కావాల్సి ఉంది. 

Updated Date - 2022-02-04T13:45:30+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!