మళ్ళీ రంగంలోకి దిగుతున్న Ramyakrishna

ABN , First Publish Date - 2022-06-01T17:43:33+05:30 IST

‘బాహుబలి’ (Bahubali) సిరీస్‌తో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో శివగామిగా బాగా పాపులర్ అయ్యారు రమ్యకృష్ణ. ఆ సినిమా తెచ్చిపెట్టిన పేరు ప్రఖ్యాతులతో సౌత్ ఇండస్ట్రీస్‌లో ఆమెకు మంచి డిమాండ్ ఏర్పడింది. కానీ ఆ తర్వాత ఆమె నటించిన పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి.

మళ్ళీ రంగంలోకి దిగుతున్న Ramyakrishna

‘బాహుబలి’ (Bahubali) సిరీస్‌తో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో శివగామిగా బాగా పాపులర్ అయ్యారు రమ్యకృష్ణ. ఆ సినిమా తెచ్చిపెట్టిన పేరు ప్రఖ్యాతులతో సౌత్ ఇండస్ట్రీస్‌లో ఆమెకు మంచి డిమాండ్ ఏర్పడింది. కానీ ఆ తర్వాత ఆమె నటించిన పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి. అయితే ఈ ఏడాది ‘బంగార్రాజు’ (Bangarraju) చిత్రంతో తిరిగి సూపర్ హిట్ అందుకున్నారు రమ్యకృష్ణ. ప్రస్తుతం ఆమె మూడు, నాలుగు చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. విజయ్ దేవకొండ (Vijay Devarakonda), పూరీ జగన్నాథ్ (Puri Jagannath)  కాంబో మూవీ లైగర్ (Liger),  కృష్ణవంశీ దర్శకత్వంలో త్వరలో విడుదలకు సిద్ధమవుతోన్న ‘రంగమార్తాండ’ (Rangamarthanda)లతో పాటు మరో రెండు చిత్రాల్లో నటించబోతున్నారు.  ఇక వీటితో పాటు రమ్యకృష్ణ మరోసారి వెబ్ సిరీస్‌లో నటించేందుకు రెడీ అవుతున్నారు. 


రమ్యకృష్ణ తన కెరీర్ లోనే తొలిసారిగా నటించిన వెబ్ సిరీస్ ‘క్వీన్’ (Queen). దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత (Jayalalitha) జీవిత విశేషాల ఆధారంగా రూపొందిన ఈ సిరీస్ మొదటి సీజన్‌కు మంచి పేరొచ్చింది. ఇందులో జయలలితగా రమ్యకృష్ణ నటించగా.. యంజీఆర్ గా మలయాళ నటుడు ఇంద్రజిత్ సుకుమారన్ (Indrajith Sukumaran) నటించారు. గౌతమ్ వాసుదేవ్ మీనన్ (Gowtham Vasudev Menon) దర్శకత్వంలో రూపొందిన ఈ సిరీస్.. మొదటి సీజన్ ముగిసి చాలా రోజులైంది. తాజాగా రెండో సీజన్ కు సంబంధించిన షూటింగ్ చెన్నైలో మొదలైంది. మ్యాక్స్ ప్లేయర్ లో స్ట్రీమింగ్ కానున్న ఈ సీరిస్ లో జయలలిత జీవితంలోని మరిన్ని కోణాలు ఆవిష్కృతం కాబోతున్నాయి. ఇందులో ప్రముఖ తెలుగు, తమిళ నటులు అభినయించబోతున్నారు. మరి క్వీన్ రెండో సీజన్ ఇంకెంతగా అలరిస్తుందో చూడాలి. 

Updated Date - 2022-06-01T17:43:33+05:30 IST

Read more