ప్రియమణి: ఆ వంట ఎలా చేయాలో తెలీదు.. త్వరలో వడ్డిస్తారు!

ABN , First Publish Date - 2022-01-17T01:41:03+05:30 IST

ఒకప్పుడు స్టార్‌ కథానాయికగా వెలుగొందిన జాతీయ అవార్డు గ్రహీత ప్రియమణి.. పెళ్లి తర్వాత కూడా సక్సెస్‌ఫుల్‌గా కెరీర్‌ కొనసాగిస్తున్నారు. తాజాగా వెబ్‌ సిరీస్‌లతోపాటు, రియాలిటీ షోలకు న్యాయ నిర్ణేతగా కూడా వ్యవహరిస్తూ బిజీగా ఉన్నారు. తాజాగా ఆమె ఆహా ఓటీటీ కోసం ‘భామా కలాపం’ పేరుతో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తున్నారు.

ప్రియమణి: ఆ వంట ఎలా చేయాలో తెలీదు.. త్వరలో వడ్డిస్తారు!

ఒకప్పుడు స్టార్‌ కథానాయికగా వెలుగొందిన జాతీయ అవార్డు గ్రహీత ప్రియమణి.. పెళ్లి తర్వాత కూడా సక్సెస్‌ఫుల్‌గా కెరీర్‌ కొనసాగిస్తున్నారు. తాజాగా వెబ్‌ సిరీస్‌లతోపాటు, రియాలిటీ షోలకు న్యాయ నిర్ణేతగా కూడా వ్యవహరిస్తూ బిజీగా ఉన్నారు. తాజాగా ఆమె ఆహా ఓటీటీ కోసం ‘భామా కలాపం’ పేరుతో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తున్నారు. అభిమన్యూ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌ గ్లిమ్స్‌ను విడుదల చేశారు. అందులో ‘లక్ష సబ్‌స్కైబర్స్‌, వెయ్యి రెసిపీలు, ప్రతివారం ఓ కొత్త వంట, కానీ ఇప్పుడు చేయబోయే వంట చాలా స్పెషల్‌.. ఎందుకంటే ఆ వంట ఎలా చేయాలో నాకు కూడా తెలీదు’ అని ప్రియమణి చెప్పిన సంభాషలు థ్రిల్లింగ్‌ అనిపిస్తున్నాయి. కథ ఏంటనేది రివీల్‌ చేయలేదు. కానీ కత్తితో తన చెయ్యిని తానే నరుకుతున్నట్లు చూపించారు. ఆ టీజర్‌ చూస్తే థ్రిల్లర్‌లాగా అనిపిస్తుంది. త్వరలోనే ఈ చిత్రం వడ్డనకు  సిద్ధమవుతుంది. 
Updated Date - 2022-01-17T01:41:03+05:30 IST