సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

OTT: తాజాగా ఓటీటీలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాలు

ABN, First Publish Date - 2022-12-22T08:51:06+05:30

కొవిడ్ కారణంగా అన్ని రంగాలు నష్టపోగా.. ఓటీటీ రంగం మాత్రం లాభపడ్డది. సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, స్పెషల్ షోలతో వినోదాన్ని పంచుతూ దూసుకుపోతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోవిడ్ కారణంగా అన్ని రంగాలు నష్టపోగా.. ఓటీటీ రంగం మాత్రం లాభపడ్డది. సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, స్పెషల్ షోలతో వినోదాన్ని పంచుతూ దూసుకుపోతున్నాయి. ఈ తరుణంలో డిసెంబర్ 21న ఓటీటీలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాలు తెలుగసుకుందాం..

మసూద (Masooda)

ఏడాది మంచి విజయం సాధించిన చిన్న చిత్రాల్లో ‘మసూద’ ఒకటి. స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌లో వచ్చిన ఈ సినిమాలో సీనియర్ నటి సంగీత (Sangeetha), తిరువీర్ (Thiruveer), కావ్య కల్యాణ్‌ రామ్‌, శుభలేఖ సుధాకర్‌ కీలక పాత్రల్లో నటించారు.

నూతన దర్శకుడు సాయికిరణ్‌ (Sai Kiran) దర్శకత్వం వహించిన ‘మసూద’ నవంబర్‌ 18న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన మంచి హార్రర్ చిత్రంగా బాక్సాఫీస్ వద్ద హిట్‌ టాక్ సొంతం చేసుకుంది. ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

ఫోన్ భూత్ (Phone Bhooth)

ఫోన్ భూత్.. 2022లో విడుదలైన హిందీ అతీంద్రియ శక్తుల హాస్య చిత్రం. ఇది గుర్మీత్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఫర్హాన్ అక్తర్, రితేష్ సిధ్వానీ నిర్మించారు. ఈ చిత్రంలో కత్రినా కైఫ్, ఇషాన్ ఖట్టర్, సిద్ధాంత్ చతుర్వేది, జాకీ ష్రాఫ్ కీలక పాత్రల్లో నటించారు. 4 నవంబర్ 2022న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ చిత్రం ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (Disney plus Hotstar)

FEB 14 - హిందీ

The Red Dress - హిందీ

Big Bet - కొరియన్

నెట్ ఫ్లిక్స్ (Netflix)

I Am a Killer Season 4 - ఇంగ్లిష్

Emily in Paris Season 3 - ఇంగ్లిష్

Interests of Love - కొరియన్

Updated Date - 2022-12-22T08:51:09+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!