Amazon Prime లో సరికొత్త వెబ్ సీరిస్
ABN , First Publish Date - 2022-06-22T22:38:01+05:30 IST
"మోడరన్ లవ్ ముంబై" (Modern Love Mumbai) కి అఖండమైన స్పందన వచ్చిన తరువాత, ప్రైమ్ వీడియో ఈరోజు (జూన్ 22) సరికొత్త వెబ్ సిరీస్ ను ప్రారంభించబోతున్నట్టు ప్రకటించింది.

"మోడరన్ లవ్ ముంబై" (Modern Love Mumbai) కి అఖండమైన స్పందన వచ్చిన నేపథ్యంలో. ప్రైమ్ వీడియో ఈరోజు (జూన్ 22) సరికొత్త వెబ్ సిరీస్ ను ప్రారంభించబోతున్నట్టు ప్రకటించింది. ప్రసిద్ధ న్యూయార్క్ టైమ్స్ కాలమ్ నుండి ప్రేరణ పొందిన ఈ సిరీస్ పేరు "మోడ్రన్ లవ్ హైదరాబాద్". ఈ భారతీయ సిరీస్ నలుగురు సృజనాత్మక వ్యక్తులను ఒకచోట చేర్చింది. నగేష్ కుకునూర్, వెంకటేష్ మహా, ఉదయ్ గుర్రాల, దేవికా బహుధనం. కొత్త తెలుగు అమెజాన్ ఒరిజినల్ సిరీస్ ప్రైమ్ వీడియోలో 8 జూలై, 2022 నుండి 240కి పైగా దేశాల్లో ప్రసారం చేయబోతోంది.
"మోడ్రన్ లవ్ హైదరాబాద్ష సిరీస్ .. హైదరాబాద్ లోని, విభిన్న కోణాల్లో ఆరు విభిన్న కథలను చెబుతుంది. ఈ సిరీస్లో రేవతి, నిత్యా మీనన్, ఆది పినిశెట్టి, రీతూ వర్మ, అభిజిత్ దుద్దాల, మాళవిక నాయర్, సుహాసిని మణిరత్నం, నరేష్ అగస్త్య, ఉల్కా గుప్తా, నరేష్ మరియు కోమలీ ప్రసాద్ లాంటి అద్భుత నటీనటులు అభినయించారు.