OTT Content: తాజాగా ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..

ABN , First Publish Date - 2022-12-16T10:48:33+05:30 IST

ఓ వైపు థియేటర్స్ వరుసగా కొత్త సినిమాలతో అలరిస్తుంటే.. మరోవైపు ఓటీటీలు సైతం అంతర్జాతీయ కంటెంట్‌తో దూసుకొస్తున్నాయి.

OTT Content: తాజాగా ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..

ఓ వైపు థియేటర్స్ వరుసగా కొత్త సినిమాలతో అలరిస్తుంటే.. మరోవైపు ఓటీటీలు సైతం అంతర్జాతీయ కంటెంట్‌తో దూసుకొస్తున్నాయి. ఈ తరుణంలో సెప్టెంబర్ 15న ఓటీటీలో విడుదలైన సినిమాలు వెబ్‌సిరీస్‌ల గురించి తెలుసుకుందాం..

జగమే మాయ (Jagamemaya)

ధన్య బాలకృష్ణన్, చైతన్య రావు, తేజ ఐనపూడి ప్రధాన పాత్రలు పోషించిన క్రైమ్ థ్రిల్లర్ ‘జగమే మాయ’. ఇన్‌స్టంట్ కర్మ అనేది ట్యాగ్‌లైన్. సునీల్ పుప్పాల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఉదయ్ కోల, విజయ్ శేఖర్ అన్నే నిర్మించారు. ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

jagame.jpg

వూ కిల్డ్ శాంటా? ఏ మర్డర్ విల్లే మర్డర్ మిస్టరీ (Who Killed Santa? A Murderville Murder Mystery)

‘వూ కిల్డ్ శాంటా? ఏ మర్డర్ విల్లే మర్డర్ మిస్టరీ’ అనేది ఓ అమెరికన్ మర్డర్ మిస్టరీ చిత్రం. మాయా రుడాల్ఫ్, జాసన్ బాటెమాన్, పీట్ డేవిడ్‌సన్‌ కీలక పాత్రల్లో నటించారు. హాలీడే తీసుకున్న ఓ డిటెక్టివ్ ఒక హత్యను మిస్టరీని పరిష్కరించడానికి పని చేయాల్సి వస్తుంది. దానికోసం తన దగ్గరి ఉన్న ఇద్దరు ట్రైనీల సహాయం తీసుకుంటాడు. ఈ నేపథ్యంలో అతనికి ఎదురైన సంఘటనల సమాహారమే ఈ చిత్రం. ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

who.jpg

నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)

Bebefinn - ఇంగ్లిష్

Sonic Prime - ఇంగ్లిష్

Violet Evergarden: Recollections - జపనీస్

Would You Like a Cup of Coffee? - కొరియన్

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ (Disney Plus Hotstar)

The Simpsons Meet the Bocellis in Feliz Navidad - ఇంగ్లిష్

అమెజాన్ ప్రైమ్ (Amazon Prime)

Physics Wallah - హిందీ

Lyle, Lyle, Crocodile - ఇంగ్లిష్

Updated Date - 2022-12-16T10:55:53+05:30 IST