OTT: తాజాగా ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..

ABN , First Publish Date - 2022-12-30T09:42:59+05:30 IST

నెట్ వినియోగం పెరిగడంతో ప్రస్తుతం ఓటీటీల హవా విపరీతంగా పెరిగింది. దీంతో థియేటర్‌‌లతో పోటీ పడుతూ స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తున్నాయి.

OTT: తాజాగా ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..
ott

నెట్ వినియోగం పెరిగడంతో ప్రస్తుతం ఓటీటీల హవా విపరీతంగా పెరిగింది. దీంతో థియేటర్‌‌లతో పోటీ పడుతూ స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తున్నాయి. థియేటర్‌లో రిలీజైన సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సాధారణమైపోయింది. తాజాగా ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల గురించి తెలుసుకుందాం..

బట్టర్ ఫ్లై (Butterfly)

‘కార్తీకేయ 2’, ‘18 పేజేస్’ వంటి హిట్ చిత్రాల తర్వాత అనుపమ పరమేశ్వరన్ ‘బట్టర్ ఫ్లై’. సినీయర్ నటి భూమిక, అనుపమ పరమేశ్వరన్, రావు రమేశ్ ప్రధాన పాత్రల్లో నటించారు. తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోతే, చెల్లెలు గీత (అనుపమ పరమేశ్వరన్‌)ను పెంచి పెద్ద చేస్తుంది. వైజయంతి (భూమిక). వైజయంతికి అప్పటికే రావు రమేశ్‌తో పెళ్లై విడాకులు తీసుకోగా.. వారికి అప్పటికే ఇద్దరు పిల్లలు ఉంటారు. వైజయంతి ఓ రోజు పని మీద ఢిల్లీకి వెళ్లగా.. ఆ ఇద్దరు పిల్లలు కిడ్నాప్ అవుతారు. వారిని రక్షించడానికి గీత చేసిన ప్రయత్నమే ఈ చిత్ర కథాంశం. ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

butterfly.jpg

గోల్డ్ (Gold)

ఆల్ఫోన్స్ పుత్రేన్ దర్శకత్వం వహించిన మలయాళ క్రైమ్ కామెడీ చిత్రం ‘గోల్డ్’. పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్‌పై సుప్రియా మీనన్, మ్యాజిక్ ఫ్రేమ్స్‌పై లిస్టిన్ స్టీఫెన్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, నయనతార, మల్లికా సుకుమారన్, షమ్మి తిలకన్, లాలూ అలెక్స్, బాబురాజ్, అజ్మల్ అమీర్, శాంతి కృష్ణ, జగదీష్, కృష్ణ శంకర్, రోషన్ మాథ్యూ, వినయ్ ఫోర్ట్, సైజు కురుప్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

gold.jpg

అమెజాన్ ప్రైమ్ (Amazon Prime)

Aline - ఫ్రెంచ్

Belén Mora: i´m latin - స్పానిష్

Dario Orsi - Me Quiero Quejar - స్పానిష్

బుక్ మై షో (Book My Show)

Nightmare Neighborhood Moms - ఇంగ్లిష్

On the Edge - ఫ్రెంచ్

షామారో మీ (Shemaroo Me)

Hello Zindagi - గుజరాతీ

నెట్‌ఫ్లిక్స్ (Netflix)

Brown and Friends - ఇంగ్లిష్

Rise of Empires: Ottoman Season 2 - ఇంగ్లిష్

Updated Date - 2022-12-30T09:45:27+05:30 IST