అలా జరిగినప్పుడే సక్సెస్ వస్తుంది: కింగ్ నాగార్జున
ABN , First Publish Date - 2022-01-18T04:05:13+05:30 IST
ఓటీటీ అనేది న్యూ రెవల్యూషన్. సినిమా అనేది ఆడియన్స్‌ను రెండున్నర గంటల పాటు థియేటర్లో కూర్చోబెట్టి మెప్పిస్తూ ఎంటర్టైన్ అయ్యేలా చేయాలి. అయితే ఓటిటి వచ్చిన తరువాత ఎంటర్టైన్మెంట్ అనేది ఫోన్లోకి వచ్చేసింది. అయితే ఓటీటీలో

‘జీ 5’ ఒరిజినల్ సిరీస్ ‘లూజర్ 1’ ప్రేక్షకాదరణ పొందడంతో.. దీనికి సీక్వెల్‌గా ‘లూజర్ 2’ను మేకర్స్ సిద్ధం చేశారు. తొలి సీజన్ అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కగా.. సీక్వెల్‌కు అభిలాష్ రెడ్డితో పాటు శ్రవణ్ మాదాల దర్శకత్వం వహించారు. జీ5, అన్నపూర్ణ స్టూడియోస్, స్పెక్ట్రమ్ మీడియా నెట్వర్క్క్ నిర్మించాయి. ఈ సీక్వెల్ జనవరి 21న విడుదల కాబోతోన్న సందర్భంగా మేకర్స్ ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కింగ్ నాగార్జున మాట్లాడుతూ.. ‘‘ఓటీటీ అనేది న్యూ రెవల్యూషన్. సినిమా అనేది ప్రేక్షకులను రెండున్నర గంటల పాటు థియేటర్లో కూర్చోబెట్టి మెప్పిస్తూ ఎంటర్టైన్ అయ్యేలా చేయాలి. అయితే ఓటీటీలు వచ్చిన తరువాత ఎంటర్టైన్మెంట్ అనేది ఫోన్లోకి వచ్చేసింది. అయితే ఓటీటీ ద్వారా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడం అంత ఈజీ కాదు. అలాంటిది ‘లూజర్’ వెబ్ సిరీస్ ప్రేక్షకులకు థ్రిల్ కలిగించేలా అద్భుతంగా తీశారు. ‘లూజర్ 2’ ట్రైలర్ చూశాను. ట్రైలర్లోనే ఇందులో ఉన్న కథ అందరికీ కనెక్ట్ అవుతుంది. అక్కడే వీరు సక్సెస్ అయినట్టు. ఏ సినిమా అయినా, వెబ్ సిరీస్ అయినా టీం ఇన్వాల్వ్ అయినప్పుడే సక్సెస్ అవుతుంది. ఈ నెల 21న జీ 5 లో స్ట్రీమింగ్ కాబోతోన్న ‘లూజర్ 2’ సిరీస్.. అందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుతూ టీం అందరికీ ఆల్ ద బెస్ట్..’’ అని అన్నారు.