సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

OTT content: తాజాగా ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..

ABN, First Publish Date - 2022-12-21T09:40:07+05:30

థియేటర్లకి పోటీగా ఓటీటీలు కూడా మంచి కంటెంట్‌తో దూసుకొస్తూ ప్రేక్షకులని అలరిస్తున్నాయి. అంతేకాకుండా అంతర్జాతీయ స్థాయిలో కంటెంట్‌ని వ్యూయర్స్‌కి అందుబాటులోకి తెస్తున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

థియేటర్లకి పోటీగా ఓటీటీలు కూడా మంచి కంటెంట్‌తో దూసుకొస్తూ ప్రేక్షకులని అలరిస్తున్నాయి. అంతేకాకుండా అంతర్జాతీయ స్థాయిలో కంటెంట్‌ని వ్యూయర్స్‌కి అందుబాటులోకి తెస్తున్నాయి. డిసెంబర్ 20న ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల గురించి తెలుసుకుందాం..

థ్యాంక్ గాడ్ (Thank God)

సిద్ధార్థ్ మల్హోత్రా, అజయ్ దేవ్‌గణ్ కీలకపాత్రల్లో నటించిన బాలీవుడ్ చిత్రం ‘థ్యాంక్ గాడ్’. ఇంద్ర కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటించింది. 2009లో వచ్చిన డానిష్ చిత్రం ‘సోర్టే కుగ్లర్ (వాట్ గోస్ ఎరౌండ్)’కి ఇది అధికారిక రీమేక్. ఈ మూవీ 25 అక్టోబర్ 2022న దీపావళి పండుగల సందర్భంగా థియేటర్లలో విడుదలైంది. ఇది విమర్శకుల నుంచి మిశ్రమ సమీక్షలను అందుకుంది. కానీ వాణిజ్యపరంగా విఫలమైంది. ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

హనీమూన్ (Honeymoon)

అమర్ ప్రీత్ ఛబ్రా దర్శకత్వం వహించిన పంజాబీ హాస్య నాటకం చిత్రం ‘హనీమూన్’. ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, హర్మన్ బవేజా, క్రిషన్ కుమార్, విక్కీ బహ్రీ నిర్మించారు. ఈ చిత్రంలో గిప్పీ గ్రేవాల్, జాస్మిన్ భాసిన్, కరమ్‌జిత్ అన్మోల్, నాసిర్ చిన్యోతి, నరేష్ కథూరియా ప్రధాన పాత్రల్లో నటించారు. 25 అక్టోబర్ 2022న విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకుంది. పంజాబ్‌కు చెందిన ఓ నవ దంపతులు హనీమూన్‌కు వెళ్లాలనుకుంటున్నారు. కానీ వారి ఉమ్మడి కుటుంబంలో దాని అర్థం తెలియదు. అందుకే వారిని ఒప్పించేందుకు ఆ జంటకి ఎదురైన సంఘటన సమాహరమే ఈ చిత్ర కథాంశం. ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)

A Not So Merry Christmas - ఇంగ్లిష్, స్పానిష్

The Seven Deadly Sins: Grudge of Edinburgh Part 1 - జపనీస్

అమెజాన్ ప్రైమ్ (Amazon Prime)

Parole - తమిళం

యూట్యూబ్ (Youtube)

A Cheat Day - హిందీ

Updated Date - 2022-12-21T09:40:10+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!