ఇండియన్ వర్షన్‌లో ‘మోడ్రన్ లవ్’

ABN , First Publish Date - 2022-02-13T23:39:37+05:30 IST

అమెజాన్ ప్రైమ్ నుండి మరో సూపర్ హిట్ వెబ్ సిరీస్ రాబోతోంది. ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్‌లను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి.. టాప్ ఓటిటి సంస్థగా దూసుకుపోతున్న అమెజాన్ ప్రైమ్.. రెండు సీజన్స్ వచ్చి సూపర్ హిట్ అయిన

ఇండియన్ వర్షన్‌లో ‘మోడ్రన్ లవ్’

అమెజాన్ ప్రైమ్ నుండి మరో సూపర్ హిట్ వెబ్ సిరీస్ రాబోతోంది. ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్‌లను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి.. టాప్ ఓటిటి సంస్థగా దూసుకుపోతున్న అమెజాన్ ప్రైమ్.. రెండు సీజన్స్ వచ్చి సూపర్ హిట్ అయిన ‘మోడ్రన్ లవ్’ ఇండియన్ వర్షన్‌ని తీసుకురాబోతోంది. ప్రముఖ భాషలన్నింటిలోనూ ఈ వెబ్ సిరీస్ ప్రసారం కానుంది. ‘మోడ్రన్ లవ్ చెన్నై’, ‘మోడ్రన్ లవ్ ముంబై’, ‘మోడ్రన్ లవ్ హైదరాబాద్’ పేరుతో.. ప్రాంతీయ భాషల్లోకి ఈ సిరీస్‌ను అనువదిస్తున్నారు. కచ్చితంగా మోడ్రన్ లవ్ ఇండియాలో కూడా ఘన విజయం సాధిస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. 


‘‘మోడ్రన్ లవ్ అనేది భిన్నమైన రూపాలలో ఉన్న ప్రేమకు ఒక భావగీతం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఈ షోలో ఉన్న పాత్రలతో రియల్ లైఫ్‌లో తమను తాము చూసుకున్నామని తెలిపారు. అలాగే భారతదేశపు భిన్నమైన సంస్కృతికి కూడా ఈ సిరీస్ అతికినట్లు ఉంటుంది. ఇక్కడ కూడా ఈ సిరీస్‌కు మంచి ఆదరణ లభిస్తుందని భావిస్తున్నాం..’’ అని షో నిర్వాహకులు ప్రకటించారు.

Updated Date - 2022-02-13T23:39:37+05:30 IST