సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ఓటీటీలో Major వచ్చేసింది..

ABN, First Publish Date - 2022-07-03T14:12:22+05:30

టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ (Adivi sesh) హీరోగా నటించిన చిత్రం మేజర్ (Major). ఈ సినిమా ఓటీటీ (OTT Realesed) స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. బాలీవుడ్ యంగ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ (Saiee Manjrekar)

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ (Adivi sesh) హీరోగా నటించిన చిత్రం మేజర్ (Major). ఈ సినిమా ఓటీటీ (OTT Realesed) స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. బాలీవుడ్ యంగ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ (Saiee Manjrekar) హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి శశి కిరణ్ తిక్క (Sashikiran Tikka) దర్శకుడు. ముంబై దాడుల్లో ఉగ్రవాదులతో వీరోచిత పోరాటం చేసి దేశం కోసం ప్రాణాలు అర్పించిన రియల్ హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ (Sandeep unni krishnan) జీవిత కథ ఆధారంగా మేజర్ రూపొందిన సంగతి తెలిసిందే. శోభిత దూళిపాళ్ల, ప్రకాష్ రాజ్, రేవతి ఇతర కీలక పాత్రలలో కనిపించారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) ఈ సినిమాను సోనీ పిక్చర్స్, ఏ ప్లస్ ఎస్ స్టూడియోస్ వారితో కలిసి నిర్మించారు.


గత నెల 3వ తేదీన రిలీజైన ఈ మూవీ మంచి హిట్ సాధించింది. కమర్షియల్ హిట్ కావడంతో పాటుగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే, సరిగ్గా నెలరోజుల్లోనే మేజర్ సినిమాను ఓటీటీ రిలీజ్ చేయడం ఆసక్తికరం. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ వారు ఈ సినిమా హక్కులు కొనుగోలు చేయగా, ఈరోజు నుంచి తెలుగు, మలయాళంతో పాటూ హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక థియేటర్స్‌లో మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు ఓటీటీలో చూసేందుకు రెడీ అయ్యారు. మరి ఈ మూవీకి డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.


కాగా, అడివి శేష్ నెక్స్ట్ సినిమాను ప్రకటించారు. బ్లాక్ బస్టర్ మూవీ హిట్ ది కేస్ 1కి సీక్వెల్ హిట్ ది సెకండ్ కేస్ రూపొందుతోంది. ఫస్ట్ పార్ట్ లో విశ్వక్ సేన్ హీరోగా నటించాడు. ఇప్పుడు సీక్వెల్ మూవీలో మాత్రం అడివి శేష్ నటిస్తున్నారు. వీలైంత త్వరగా చిత్రాన్ని పూర్తి చేసి ఇదే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. 

Updated Date - 2022-07-03T14:12:22+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!