‘ఎమోజీ’ పేరుతో వెబ్ సిరీస్.. హీరోహీరోయిన్లు ఎవరంటే?
ABN , First Publish Date - 2022-03-26T02:11:19+05:30 IST
పెళ్ళయిన ఓ జంట విడిపోయాలని భావిస్తుంది. అలాంటి దంపతులను ప్రేమ కలిపిందా? లేదా? వారి చుట్టూ ఎమోషనల్ లవ్ ప్రతిబింబించేలా ఈ వెబ్‌సిరీస్‌ను రూపొందిస్తున్నారు. కరోనా మార్గదర్శకాలకు లోబడి చెన్నై, తెన్కాశి, నాగర్‌కోయిల్..

కోలీవుడ్‌లో ప్రతిభావంతుడైన యువ నటుడు మహత్ రాఘవేంద్ర సరికొత్త పంథాలో సాగే విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తన కెరీర్‌ను కొనసాగిస్తున్నాడు. ఇపుడు ‘ఎమోజీ’ పేరుతో తెరకెక్కుతున్న వెబ్ సిరీస్‌లో నటిస్తుండగా ఇందులో మహత్ సరసన దేవిక, మానస హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆడుగలం నరేన్, వీజే ఆషిక్, ప్రియదర్శిని రాజ్‌కుమార్ ఇతర పాత్రలను పోషిస్తున్నారు.
పెళ్ళయిన ఓ జంట విడిపోయాలని భావిస్తుంది. అలాంటి దంపతులను ప్రేమ కలిపిందా? లేదా? వారి చుట్టూ ఎమోషనల్ లవ్ ప్రతిబింబించేలా ఈ వెబ్‌సిరీస్‌ను రూపొందిస్తున్నారు. కరోనా మార్గదర్శకాలకు లోబడి చెన్నై, తెన్కాశి, నాగర్‌కోయిల్, హైదరాబాద్, కేరళ అడవుల్లో షూటింగ్ చేశారు. ఈ వెబ్ సిరీస్‌కు కథను సమకూర్చిన ఎస్.రంగస్వామి దర్శకత్వ బాధ్యతలను కూడా నిర్వహించారు.