తాజాగా OTTలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాలు ఇవే..

ABN , First Publish Date - 2022-12-13T08:43:04+05:30 IST

కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి.

తాజాగా OTTలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాలు ఇవే..
ott

కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ.. బోర్‌గా ఫీల్ అవుతున్న సినీ లవర్స్‌కి ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందించాయి. అయితే కరోనా తగ్గుముఖం పట్టాక ఓటీటీల జోరు తగ్గి థియేటర్ రిలీజ్‌లు మళ్లీ పెరుగుతాయని అందరూ అనుకున్నారు. కానీ అనుహ్యంగా వాటి ప్రాబల్యం ఏ మాత్రం తగ్గకపోగా.. రోజు రోజుకి స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తూ అదరగొడుతున్నాయి. కాగా డిసెంబర్ 12న ఓటీటీలో విడుదలైన వెబ్ సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..

స్ట్రాంగ్ ఫాదర్స్, స్ట్రాంగ్ డాటర్స్ (Strong Fathers, Strong Daughters)

ఒక సంపన్న వ్యాపారవేత్త సడెన్‌గా తన కుమార్తెకి నిశ్చితార్థం చేయడానికి సిద్ధమవుతాడు. అయితే.. ఆమెపై నియంత్రణను వదులుకోవడానికి అతను ప్రయత్నిస్తాడు. అలాగే.. ఆమె భవిష్యత్తు గురించి దేవుడిపై భారం వేస్తాడు. డేవిడ్ దే వోస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బార్ట్ జాన్సన్, రొబిన్ లైవ్‌లీ, మరియా కెనాల్స్ బర్రెరా, డేవిడ్ బర్రెరా ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది.

strong.jpg

ది సీడ్ (The Seed)

ది సీడ్ అనేది బాడీ హారర్ ఫీచర్ ఫిల్మ్ దర్శకుడిగా సామ్ వాకర్ పరిచయం అయిన చిత్రం. ఈ చిత్రం యునైటెడ్ స్టేట్స్‌లో బియాండ్ ఫెస్ట్‌లో ప్రదర్శించారు. అనంతరం థియేటర్స్‌లో విడుదలైంది. ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

seed.jpg

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (Disney Plus Hotstar)

Tasawur - హిందీ

The Good News - హిందీ

నెట్‌ఫ్లిక్స్ (Netflix)

My Next Guest with David Letterman and Volodymyr Zelenskyy (2022) - ఇంగ్లిష్, ఉక్రెయిన్

Updated Date - 2022-12-13T08:48:48+05:30 IST

Read more