OTT content: తాజాగా ఓటీటీలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాలు ఇవే..

ABN , First Publish Date - 2022-12-29T09:12:23+05:30 IST

ఈ డిజిటల్ యుగంలో ఓటీటీలు స్పెషల్ కంటెంట్ ముందకొస్తూ.. థియేటర్స్‌కి గట్టి పోటీని ఇస్తున్నాయి. ఓ వైపు సినిమాలు.. మరోవైపు వెబ్‌సిరీస్‌లతో వ్యూవర్స్‌కి వినోదాన్ని పంచుతున్నాయి.

OTT content: తాజాగా ఓటీటీలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాలు ఇవే..
ott

ఈ డిజిటల్ యుగంలో ఓటీటీలు స్పెషల్ కంటెంట్ ముందకొస్తూ.. థియేటర్స్‌కి గట్టి పోటీని ఇస్తున్నాయి. ఓ వైపు సినిమాలు.. మరోవైపు వెబ్‌సిరీస్‌లతో వ్యూవర్స్‌కి వినోదాన్ని పంచుతున్నాయి. కాగా.. డిసెంబర్ 28న ఓటీటీలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..

పట్టతు అరసన్ (Pattathu Arasan)

‘గద్దలకొండ గణేశ్’ ఫేం అధర్వ మురళీ, సినీయర్ నటుడు రాజ్ కిరణ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘పట్టతు అరసన్’. 2022లో విడుదలైన ఈ మూవీ తమిళ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా చిత్రం. ఎ. సర్కునం రచన, దర్శకత్వం వహించాడు. లైకా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై అల్లిరాజా సుభాస్కరన్ నిర్మించాడు. ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్, రాధికా శరత్‌కుమార్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం అందించగా.. లోగనాథన్ శ్రీనివాసన్ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ చిత్రం 25 నవంబర్ 2022న థియేటర్లలో విడుదలై మంచి టాక్‌ని సొంతం చేసుకుంది. ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

pattathu.jpg

సాయం (Saayam)

‘సాయం’.. 2022లో విడుదలైన ఈ మూవీ తమిళ డ్రామా చిత్రం. ఆంటోనీ సామి రచన, దర్శకత్వం వహించాడు. అభి శరవణన్, షైనీ, పొన్వన్నన్ ప్రధాన పాత్రల్లో నటించారు. వైట్ ల్యాంప్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రం 4 ఫిబ్రవరి 2022న విడుదలై సానుకూల సమీక్షలు అందుకుంది. ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ గూగుల్ ప్లేలో స్ట్రీమింగ్ అవుతోంది.

saayam.jpg

నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)

Double XL - హిందీ

A Night at the Kindergarten - పోలిష్, హిందీ, ఇంగ్లిష్

The Circle Season 5 - ఇంగ్లిష్

Love Is Blind: Brazil Season 2 - పోర్చుగీస్

Stuck with You - ఫ్రెంచ్

7 Women and a Murder - ఇటాలియన్

అమెజాన్ ప్రైమ్ (Amazon Prime)

FC Barcelona, A New Era - స్పానిష్, ఇంగ్లిష్

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (Disney Plus Hotstar)

Encanto at the Hollywood Bowl - ఇంగ్లిష్

Yakuza Lover - జపనీస్

Updated Date - 2022-12-29T09:23:55+05:30 IST