‘కోతల రాయుడు’ ఓటీటీలోకి వచ్చేస్తున్నాడు

ABN , First Publish Date - 2022-02-26T02:01:14+05:30 IST

ఏ.యస్.కె. ఫిలిమ్స్ బ్యానర్‌లో హీరో శ్రీకాంత్, ‘కృష్ణాష్టమి’ ఫేమ్ డింపుల్ చోపడే, ‘జై సింహ’ ఫేం నటషా దోషి హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కోతల రాయుడు’. సుధీర్ రాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఏ.ఎస్.కిషోర్, కొలన్ వెంకటేష్

‘కోతల రాయుడు’ ఓటీటీలోకి వచ్చేస్తున్నాడు

ఏ.యస్.కె. ఫిలిమ్స్ బ్యానర్‌లో హీరో శ్రీకాంత్, ‘కృష్ణాష్టమి’ ఫేమ్ డింపుల్ చోపడే, ‘జై సింహ’ ఫేం నటషా దోషి హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కోతల రాయుడు’. సుధీర్ రాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఏ.ఎస్.కిషోర్, కొలన్ వెంకటేష్ సంయుక్తంగా నిర్మించారు. ఫిబ్రవరి 4న థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రం.. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా దర్శకనిర్మాతలు మీడియాకు ఓటీటీ విడుదల విషయాలను తెలియజేశారు.


చిత్ర నిర్మాతలు ఏ.ఎస్.కిషోర్, కొలన్ వెంకటేష్ లు మాట్లాడుతూ.. ‘‘ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ నెల 4న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మా ‘కోతల రాయుడు’ చిత్రం.. విడుదలైన అన్ని థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శింపబడింది. తద్వారా మాకు కూడా ఎంతో పేరు తెచ్చిపెట్టింది. మంచి సినిమా ఎప్పుడొచ్చినా ప్రేక్షకులు ఆదరిస్తారని మా చిత్రం ద్వారా ప్రేక్షకులు మరోసారి నిరూపించారు. చిత్రాన్ని ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. కామెడీ, ఫైట్స్ బాగున్నాయి. శ్రీకాంత్ నటన చిత్రానికి హైలెట్‌గా నిలుస్తుంది. అయితే కరోనా కారణంగా థియేటర్స్‌కు వచ్చి చూడని వారికోసం ఇప్పుడు చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేయబోతున్నాము. అందరూ మా సినిమాని చూసి ఆదరిస్తారని కోరుతున్నాము..’’ అన్నారు. 


చిత్ర దర్శకుడు సుధీర్ రాజు మాట్లాడుతూ.. ‘‘మంచి కథకు దర్శకత్వం వహించే అవకాశం కల్పించిన నిర్మాతలకు ధన్యవాదాలు. ఫ్యామిలీలో ఉన్న అందరూ కలిసి చూడదగ్గ అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి. శ్రీకాంత్ పాత్ర అందరికీ కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది’’ అన్నారు.

Updated Date - 2022-02-26T02:01:14+05:30 IST