‘గాలివాన’: రాధికా శరత్ కుమార్ క్యారెక్టర్ రివీల్ చేసిన కుష్బూ

ABN , First Publish Date - 2022-03-23T23:42:18+05:30 IST

బిబిసి స్టూడియోస్‌, నార్త్‌ స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ భాగస్వామ్యంతో బిబిసి స్టూడియోస్‌ నిర్మించిన యురోపియన్‌ డ్రామాను తెలుగు ప్రేక్షకుల అభిరుచుల మేరకు మార్పులు చేసి జీ5 వారు ‘గాలివాన’ అనే ఒరిజినల్‌ సిరీస్‌గా నిర్మిస్తున్నారు. జీ5 ఓటీటీలో

‘గాలివాన’: రాధికా శరత్ కుమార్ క్యారెక్టర్ రివీల్ చేసిన కుష్బూ

బిబిసి స్టూడియోస్‌, నార్త్‌ స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ భాగస్వామ్యంతో బిబిసి స్టూడియోస్‌ నిర్మించిన యురోపియన్‌ డ్రామాను తెలుగు ప్రేక్షకుల అభిరుచుల మేరకు మార్పులు చేసి జీ5 వారు ‘గాలివాన’ అనే ఒరిజినల్‌ సిరీస్‌గా నిర్మిస్తున్నారు. జీ5 ఓటీటీలో ఏప్రిల్ 14న స్ట్రీమింగ్ కానున్న ఈ వెబ్ సిరీస్‌లో రాధికా శరత్ కుమార్ పాత్రకు సంబంధించిన ప్రోమోను సీనియర్ నటి కుష్బూ బుధవారం సాయంత్రం 4 గంటలకు విడుదల చేశారు. ఈ ప్రోమోలో రాధికా శరత్ కుమార్ చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్స్ ఆసక్తికరంగా ఉన్నాయి.


‘‘జీవితంలో మనకు ఎన్నో కష్టాలు వచ్చాయి. కానీ నిజమైన కష్టం ఏమిటో.. తెలుసా శ్రావణి?  ఏ.. కొడుకునైతే నవమాసాలు మోసి కన్నానో.. వాడికి కర్మ కాండలు జరిపించడం. నా కొడుకు, కోడలును చంపిన వాడు బ్రతకకూడదు..’’ అని రాధిక చెప్పే డైలాగ్స్‌తో ఈ సిరీస్ ఫ్యామిలీ, రివెంజ్ డ్రామాగా తెరకెక్కినట్లు అర్థమవుతుంది. ప్రస్తుతం రాధిక చెప్తున్న ఈ ఎమోషనల్ డైలాగ్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో రాధికా శరత్‌ కుమార్‌, డైలాగ్ కింగ్ సాయి కుమార్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా చాందిని చౌదరి, చైతన్య కృష్ణ, శరణ్య ప్రదీప్, అశ్రిత, అర్మాన్ మరియు నందిని రాయ్, తాగుబోతు రమేష్‌, కీలక పాత్రలు పోషిస్తున్నారు. శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వంలో ఈ సిరీస్ రూపుదిద్దుకుంది.Updated Date - 2022-03-23T23:42:18+05:30 IST