ఓటీటీలోకి వచ్చేస్తున్న 'ఖిలాడీ'..ఎప్పటినుంచి అంటే..!

ABN , First Publish Date - 2022-03-05T13:52:19+05:30 IST

మాస్ మహారాజ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ 'ఖిలాడి' ఓటీటీలోకి వచ్చేస్తుంది. రమేశ్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మాస్ మహారాజా డ్యూయల్ రోల్‌లో నటించారు.

ఓటీటీలోకి వచ్చేస్తున్న 'ఖిలాడీ'..ఎప్పటినుంచి అంటే..!

మాస్ మహారాజ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ 'ఖిలాడి' ఓటీటీలోకి వచ్చేస్తుంది. రమేశ్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మాస్ మహారాజా డ్యూయల్ రోల్‌లో నటించారు. డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరీ హీరోయిన్స్‌గా నటించారు. పెన్ స్టూడియోస్ నిర్మించిన ఈ సినిమా గత నెల 11వ తేదీన తెలుగుతో పాటు హీందీలోనూ విడుదలైది. కానీ, బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది. అయితే, ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. దిగ్గజ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో మార్చి 11 నుంచి 'ఖిలాడి' చిత్రం స్ట్రీమింగ్ కానుంది. యాక్షన్ కింగ్ అర్జున్, అనసూయ భరద్వాజ్ కీలక పాత్రల్లో నటించారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ దీనికి సంగీతం అందించారు. మరి ఓటీటీలోనైనా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందేమో చూడాలి. 

Updated Date - 2022-03-05T13:52:19+05:30 IST