సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Masooda OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన ‘మసూద’.. ఎక్కడంటే..

ABN, First Publish Date - 2022-12-21T12:48:13+05:30

ఈ ఏడాది మంచి విజయం సాధించిన చిన్న చిత్రాల్లో ‘మసూద’ (Masooda) ఒకటి. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఈ ఏడాది మంచి విజయం సాధించిన చిన్న చిత్రాల్లో ‘మసూద’ (Masooda) ఒకటి. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ కలెక్షన్ల పరంగానూ దుమ్మురేపింది. స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌లో వచ్చిన ఈ సినిమాలో సీనియర్ నటి సంగీత (Sangeetha), తిరువీర్ (Thiruveer), కావ్య కల్యాణ్‌ రామ్‌, శుభలేఖ సుధాకర్‌ కీలక పాత్రల్లో నటించారు.

నూతన దర్శకుడు సాయికిరణ్‌ (Sai Kiran) దర్శకత్వం వహించిన ‘మసూద’ నవంబర్‌ 18న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన మంచి హార్రర్ చిత్రంగా బాక్సాఫీస్ వద్ద హిట్‌ టాక్ సొంతం చేసుకుంది. ఈ థియేటర్స్‌లో సినిమాని చూడలేకపోయిన ప్రేక్షకుల కోసం ఈ చిత్రం ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. ఈ మూవీ నేటి (డిసెంబర్ 21) నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా వీడియో’ (Aha Video)లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ విషయాన్ని తెలుపుతూ కొన్ని రోజుల క్రితమే ఆహా యాజమాన్యం ఓ ట్రైలర్‌ని కూడా విడుదల చేసింది. థియేటర్స్‌లో ఈ చిత్రాన్ని మిస్సయిన వారు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.

Updated Date - 2022-12-21T12:48:15+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!