డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ‘హీరో’.. ఎప్పుడంటే?
ABN , First Publish Date - 2022-02-03T03:53:14+05:30 IST
సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుండి ‘హీరో’గా పరిచయమైన అశోక్ గల్లా నటించిన చిత్రం ఓటీటీలో వచ్చేస్తోంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో.. అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై శ్రీమతి గల్లా పద్మావతి నిర్మించిన చిత్రం ‘హీరో’. సంక్రాంతి

సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుండి ‘హీరో’గా పరిచయమైన అశోక్ గల్లా నటించిన చిత్రం ఓటీటీలో వచ్చేస్తోంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో.. అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై శ్రీమతి గల్లా పద్మావతి నిర్మించిన చిత్రం ‘హీరో’. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జనవరి 15న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం.. సక్సెస్ ఫుల్ చిత్రంగా బాక్సాఫీస్ వద్ద నిలబడింది. ఇప్పుడీ చిత్రం ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అవుతోంది.
అశోక్ గల్లా సరసన హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఫిబ్రవరి 11వ తేదీన విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. కాగా, థియేటర్లలో ఈ చిత్రం ఎలా సక్సెస్ ఫుల్ చిత్రంగా నిలిచిందో.. ఓటీటీలోనూ అలాగే ఆదరణను పొందుతుందని చిత్రయూనిట్ భావిస్తోంది.