ఓటీటీలో.. గౌతమ్‌ మేనన్‌ సినిమా

ABN , First Publish Date - 2022-01-30T03:52:06+05:30 IST

ప్రముఖ దర్శకుడు గౌతమ్‌ మేనన్‌ తాజాగా తెరకెక్కించిన ‘జోష్‌వా ఇమై పోల కాక్క’ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్‌ చేసేలా ప్లాన్‌ చేస్తున్నారు. వరుణ్‌ హీరోగా, రాహె హీరోయిన్‌గాను.. యోగిబాబు, డీడీ వంటి అనేక మంది నటీనటులు

ఓటీటీలో.. గౌతమ్‌ మేనన్‌ సినిమా

ప్రముఖ దర్శకుడు గౌతమ్‌ మేనన్‌ తాజాగా తెరకెక్కించిన ‘జోష్‌వా ఇమై పోల కాక్క’ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్‌ చేసేలా ప్లాన్‌ చేస్తున్నారు. వరుణ్‌ హీరోగా, రాహె హీరోయిన్‌గాను.. యోగిబాబు, డీడీ వంటి అనేక మంది నటీనటులు ఇతర పాత్రలను పోషించగా, ప్రముఖ నిర్మాత డాక్టర్‌ ఐసరి కె.గణేష్‌ వేల్స్‌ ఫిల్మ్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ పతాకంపై నిర్మించారు. లండన్‌ నుంచి చెన్నై వచ్చే ఒక యువతిని కాపాడే బాడీగార్డు పాత్రలో వరుణ్‌ నటించారు. గౌతమ్‌ మేనన్‌ స్టైల్‌లో భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందించారు. 


ఈ చిత్రం గురించి నిర్మాత ఐసరి గణేష్‌ మాట్లాడుతూ.. ‘‘షూటింగ్‌తో పాటు నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. వచ్చే నెలలో ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేసేలా ప్లాన్‌ చేశాం. కానీ, కరోనా వైరస్‌ కట్టడి చర్యల్లో భాగంగా థియేటర్లకు పలు ఆంక్షలు విధించారు. దీంతో ఈ మూవీని ఓటీటీలో రిలీజ్‌ చేయాలని ప్లాన్‌ చేసి, అందుకోసం పలు ఓటీటీ సంస్థలతో చర్చలు జరుపుతున్నాం’’ అని వివరించారు. 

Updated Date - 2022-01-30T03:52:06+05:30 IST