‘గాలివాన’: ఇంట్రెస్టింగ్‌గా మోషన్ పోస్టర్
ABN , First Publish Date - 2022-03-17T01:00:12+05:30 IST
సాయికుమార్, రాధిక శరత్‌కుమార్, నందిని రాయ్, చాందిని చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘గాలివాన’. బిబిసి స్టూడియోస్, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ భాగస్వామ్యంతో బిబిసి స్టూడియోస్ నిర్మించిన యురోపియన్ డ్రామాను తెలుగు ప్రేక్షకుల

సాయికుమార్, రాధిక శరత్‌కుమార్, నందిని రాయ్, చాందిని చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘గాలివాన’. బిబిసి స్టూడియోస్, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ భాగస్వామ్యంతో బిబిసి స్టూడియోస్ నిర్మించిన యురోపియన్ డ్రామాను తెలుగు ప్రేక్షకుల అభిరుచుల మేరకు మార్పులు చేసి ‘గాలివాన’ అనే ఒరిజినల్ సిరీస్‌గా జీ 5 ఓటీటీ అందించబోతోంది. ఎప్పటికప్పుడు వీక్షకులకు ఏదో ఒక కొత్తదనం అందించాలనే సంకల్పంతో అన్ని తరహాల సినిమాలు, ఒరిజినల్ వెబ్ సిరీస్‌లను అందించేందుకు జీ 5 ముందు వరసలో ఉంటున్న విషయం తెలిసిందే. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నుండి కామెడీ డ్రామా ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’, అన్నపూర్ణ స్టూడియోస్ నుండి ‘లూజర్’ మరియు ‘సంకెళ్లు’ (తమిళంలోని విళంగు సిరీస్ నుండి డబ్బింగ్ సిరీస్) వంటి టాప్ నాచ్ సిరీస్‌లను అందించిన జీ 5, ఇప్పుడు ‘గాలివాన’తో రాబోతోంది.
తాజాగా ఈ సిరీస్‌కు సంబంధించి ఓ మోషన్ పోస్టర్‌ను జీ 5 విడుదల చేసింది. ఇందులో రాధికా శరత్ కుమార్, డైలాగ్ కింగ్ సాయి కుమార్ వంటి సీనియర్ నటులతో పాటు చాందిని చౌదరి, చైతన్య కృష్ణ, శరణ్య ప్రదీప్, అశ్రిత, అర్మాన్ మరియు నందిని రాయ్, తాగుబోతు రమేష్ వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్న టైటిల్ మరియు పాత్రలను వెల్లడించేలా ఇంట్రెస్టింగ్‌గా ఈ మోషన్ పోస్టర్‌ను డిజైన్ చేశారు. కాగా, అయితే ఈ వెబ్ సిరీస్ కథ ఏంటి? రిలీజ్ ఎప్పుడు చేస్తారు? అనేది త్వరలోనే మేకర్స్ తెలియజేయనున్నారు.