ఓటీటీలో 'ఎనిమీ'.. ఎప్పుడంటే..!
ABN , First Publish Date - 2022-02-11T15:41:55+05:30 IST
తమిళ స్టార్స్ విశాల్, ఆర్య హీరోలుగా నటించిన లేటెస్ట్ మూవీ 'ఎనిమీ'. ఈ సినిమా నవంబర్ 2021లో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రానికి ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించారు. కాగా, 'ఎనిమీ' త్వరలో సోనీ లివ్‌లో స్ట్రీమింగ్కు రెడి అవుతోంది.

తమిళ స్టార్స్ విశాల్, ఆర్య హీరోలుగా నటించిన లేటెస్ట్ మూవీ 'ఎనిమీ'. ఈ సినిమా నవంబర్ 2021లో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రానికి ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించారు. కాగా, 'ఎనిమీ' త్వరలో సోనీ లివ్‌లో స్ట్రీమింగ్కు రెడి అవుతోంది. ఫిబ్రవరి 18, 2022 నుండి తమ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో స్ట్రీమ్ చేయడానికి యాక్షన్ థ్రిల్లర్ సినిమా అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఈ విషయాన్ని తాజాగా సోషల్ మీడియా వేదికగా ఓ స్పెషల్ ప్రోమోను వదిలి అధికారికంగా ప్రకటించారు. ఇందులో మమతా మోహన్‌దాస్, మృణాళిని రవి హీరోయిన్స్‌గా నటించారు. ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషించారు.