ఆహాలోకి వచ్చేసిన 'డీజే టిల్లు'..
ABN , First Publish Date - 2022-03-04T14:11:13+05:30 IST
యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ, నేహాశెట్టి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'డీజే టిల్లు' తాజాగా తెలుగు ఓటీటీ ఆహాలోకి వచ్చేసింది. విమల్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్

యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ, నేహాశెట్టి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'డీజే టిల్లు' తాజాగా తెలుగు ఓటీటీ ఆహాలోకి వచ్చేసింది. విమల్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 12న థియేటర్లలో విడుదలై అన్నీ వర్గాల ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. మాస్ మహారాజ రవితేజ డ్యూయల్ రోల్లో నటించగా విడుదలైన ఖిలాడి సినిమాతో పాటు విడుదలైన 'డీజే టిల్లు' ఆ సినిమా కంటే మంచి వసూళ్ళు రాబట్టింది. అయితే, ఇప్పుడు ఈ మూవీ ఆహాలో ఓటీటీలో వచ్చేసి ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ మేరకు తాజాగా ఓ ట్రైలర్ను కూడా ఆహా రిలీజ్ చేసింది. ఇక ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైనెమెంట్స్ బ్యానర్లో పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. కాగా, ఈ సూపర్ హిట్ మూవీకి సీక్వెల్ నిర్మించే ప్లాన్లో మేకర్స్ ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.