ఇటువంటి పాత్రను ఇప్పటి వరకు నేను చేయలేదు: ప్రియమణి

ABN , First Publish Date - 2022-02-01T03:22:08+05:30 IST

తెలుగు ఓటీటీ మాధ్య‌మం ఆహాలో ఇంటి భోజ‌నంలాంటి థ్రిల్ల‌ర్ కామెడీ వెబ్ ఒరిజిన‌ల్ ‘భామా కలాపం’ స్ట్రీమింగ్ కాబోతోంది. నటి ప్రియమణి ఈ వెబ్ ఒరిజినల్‌లో కీలక పాత్రలో నటిస్తున్నారు. అభిమన్యు తాడి మేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వెబ్ ఒరిజిన‌ల్

ఇటువంటి పాత్రను ఇప్పటి వరకు నేను చేయలేదు: ప్రియమణి

తెలుగు ఓటీటీ మాధ్య‌మం ఆహాలో ఇంటి భోజ‌నంలాంటి థ్రిల్ల‌ర్ కామెడీ వెబ్ ఒరిజిన‌ల్ ‘భామా కలాపం’ స్ట్రీమింగ్ కాబోతోంది. నటి ప్రియమణి ఈ వెబ్ ఒరిజినల్‌లో కీలక పాత్రలో నటిస్తున్నారు. అభిమన్యు తాడి మేటి దర్శకత్వంలో తెరకెక్కగా.. ఫిబ్ర‌వ‌రి 11న ‘ఆహా’లో ప్రసారం కానుంది. ‘డియర్ కామ్రేడ్’ డైరెక్టర్ భరత్ కమ్మ షో రన్నర్. ఈ వెబ్ ఒరిజినల్ ట్రైలర్‌ను ‘లైగ‌ర్’ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ సోమవారం విడుదల చేశారు. 


ట్రైలర్‌ను గమనిస్తే.. ‘‘నేను వాస‌న చూసే కూర‌లో ఉప్పు ఎక్కువైందో.. త‌క్కువైందో చెప్పేస్తాను.. దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అది. నేను ప‌సిగ‌ట్టింది త‌ప్ప‌య్యే ఛాన్సే లేదు’ అని అనుపమ (ప్రియమణి) తన స్నేహితురాలితో చెప్పడంతో ట్రైలర్ స్టార్ట్ అయ్యింది. కోల్‌క‌త్తా మ్యూజియంలోని ప్ర‌ద‌ర్శ‌న‌కు ఉంచిన రూ.200 కోట్ల విలువైన‌ ఓ ఎగ్ (గుడ్డు) మిస్ అవుతుంది. అదెక్కడుందో క‌నిపెట్ట‌డానికి పోలీస్ డిపార్ట్‌మెంట్ అంతా వెతుకులాట ప్రారంభిస్తారు. ఆ గుడ్డుకి ఓ అపార్ట్‌మెంట్‌లో ఉండే హౌస్ వైఫ్ అనుప‌మ‌కి ఏంటి సంబంధం? కుటుంబ‌మే లోకంగా ఉండే అనుప‌మ తీరిక ఉన్న‌ప్పుడు డిఫ‌రెంట్ వెరైటీస్ వంట‌ల‌ను వండి వాటిని యూ ట్యూబ్‌లో పోస్ట్ చేస్తుంటుంది. అస‌లు అనుప‌మ ఉండే అపార్ట్‌మెంట్‌కి, కోల్‌క‌త్తాలో మిస్ అయిన ఎగ్‌కు లింకేంటి? అనేదే ఈ ‘భామా కలాపం’.


ట్రైలర్ విడుదల అనంతరం హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ‘‘భరత్ కమ్మ, నేను ‘డియర్ కామ్రేడ్’ సినిమా చేశాం. తనతో సినిమా చేయాలని నేనే కోరుకున్నాను. నా కెరీర్లో నేను మరచిపోలేని చిత్రమది. బాపినీడు, ప్రసాద్‌గారికి, డైరెక్టర్ అభికి అభినందనలు. ఇక ప్రియ‌మ‌ణిగారి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆమె ఏ లాంగ్వేజ్‌లో చేసిన పర్ఫెక్ట్‌గా సూట్ అవుతారు. ఆమె చేసిన ‘భామా క‌లాపం’ ఒరిజినల్ ఫిబ్ర‌వ‌రి 11న రిలీజ్ అవుతుంది. త‌ప్ప‌కుండా అంద‌రికీ న‌చ్చేలా ఉంటుంది. ఆహా టీమ్‌కు ఆల్ ది బెస్ట్‌’’ అన్నారు. 


ప్రియమణి మాట్లాడుతూ ‘‘భామా కలాపం అనేది నా డిజిటల్ బెస్ట్ డెబ్యూ అని చెప్పాలి. అందుకు భరత్ కమ్మగారికి థాంక్స్. భరత్ కమ్మ, అభిమన్యు తాడి మేటిని చాలా ఇబ్బంది పెట్టాను. చాలా ఓర్పుగా భరించారు.. అందుకు వారికి థాంక్స్‌. మొద‌టి షెడ్యూల్ కోసం ఆరు రోజులు కేటాయించాను. త‌ర్వాత షెడ్యూల్ కోసం నెల‌న్న‌ర పాటు స‌మ‌యం కేటాయించలేక‌పోయాను. త‌ర్వాత సింపుల్‌గా, స్వీట్‌గా పూర్తి చేసేలా భ‌ర‌త్‌, అభి వ‌ర్క్ చేశారు. అనుప‌మ వంటి క్యారెక్ట‌ర్‌ను ఇప్ప‌టి వ‌ర‌కు నేను ప్లే చేయ‌లేదు. చాలా అమాయక‌మైన గృహిణి పాత్ర‌లో క‌నిపిస్తాను. ఫిబ్ర‌వ‌రి 11న భామా క‌లాపం ఆహాలో ప్రసారం కానుంది. ఇంత పెద్ద ఎత్తున దీన్ని తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్న ఆహా టీమ్‌కు థాంక్స్‌’’ అన్నారు.


సీనియ‌ర్ నిర్మాత బి.వి.ఎస్.ఎన్‌.ప్ర‌సాద్ మాట్లాడుతూ ‘‘నేను నలబై ఏళ్లుగా ఇండ‌స్ట్రీలో ఉన్నాను. అంద‌రూ ఆద‌రించారు. ఇప్పుడు మా అబ్బాయి బాపినీడు, సుధీర్‌తో క‌లిసి ఎస్‌వీసీసీ డిజిటల్ మీద చేస్తున్న ఈ ప్ర‌య‌త్నాన్ని అంద‌రూ ఆద‌రిస్తార‌ని భావిస్తున్నాం’’ అన్నారు. 

Updated Date - 2022-02-01T03:22:08+05:30 IST