Bhala Thandanana: రెండు వారాలకే ఓటీటీలో
ABN , First Publish Date - 2022-05-13T20:06:12+05:30 IST
టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు (Srivishnu), కేథరీన్ (Catherine) జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'భళా తందనాన' (Bhala Thandanana). ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్సైంది.

టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు (Srivishnu), కేథరీన్ థ్రెసా (Catherine Tresa) జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'భళా తందనాన' (Bhala Thandanana). ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్సైంది. కరోనా వేవ్స్ మొదలైనప్పటి నుంచి ఓటీటీలకు ప్రేక్షకుల్లో ఆదరణ ఎక్కువైందనే చెప్పాలి. అందుకే, మేకర్స్ కూడా ఎంత భారీ హిట్ చిత్రాన్నైనా నెల.. నెలన్నరలోపే ఓటీటీలోకి తీసుకువస్తున్నారు. చైతన్య దంతులూరి దర్శకత్వంలో హీరో శ్రీవిష్ణు, కేథరీన్ జంటగా నటించిన 'భళా తందనాన' చిత్రం మే 6వ తేదీన విడుదలైంది.
ఈ సినిమాకు కాస్త డివైడ్ టాక్ వచ్చింది. కానీ, హీరోకు మాత్రం పర్ఫార్మెన్స్ పరంగా ప్రశంసలు దక్కాయి. ఈ మూవీని వారాహి చలన చిత్రం పతాకంపై సాయి కొర్రపాటి నిర్మించారు. అయితే, సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) సినిమా విడుదల కారణంగా థియేటర్లలో ఈ సినిమాకు కలెక్షన్స్ తగ్గాయి. దాంతో మేకర్స్ ఈ చిత్రాన్ని ఓటీటీ స్ట్రీమింగ్కు సిద్ధం చేశారు. ప్రముఖ ఓటీటీ అయిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ద్వారా 'భళా తందనాన' చిత్రాన్ని స్ట్రీమింగ్ చేసేందుకు గాను అఫీషీయల్గా డేట్ ప్రకటించారు.
మే 20వ తారీకున ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది. మే 6న రిలీజైన 'భళా తందనాన' మే 20న అంటే కేవలం రెండు వారల్లోనే ఓటీటీలోకి వస్తుండటం ఆసక్తికరం అని చెప్పొచ్చు. ఎంతలేదన్నా కనీసం 50 రోజుల తర్వాతే థియేటర్స్లో విడుదలైన చిత్రాలను ఓటీటీలోకి తీసుకువస్తున్నారు. అయితే, శ్రీవిష్ణు తను చేసే సినిమాల కథ, కథనం కొత్తగా ఉండేలా జాగ్రత్తపడుతుంటాడు. అందుకే, ప్రేక్షకుల్లో ఈ హీరో సినిమా అంటే ఆసక్తి బాగానే ఉంటుంది. ఇదే కారణంతో త్వరగా ఓటీటీలోకి భళా తందనాన చిత్రాన్ని తీసుకువస్తున్నారు.