“డిస్నీ ప్లస్ హాట్ స్టార్”లో అలరిస్తున్న భీమ్లా నాయక్..

ABN , First Publish Date - 2022-03-24T17:28:35+05:30 IST

"ఏ పేరు తలిస్తే అభిమానులు పండుగ చేసుకుంటారో... ఏ ఇమేజ్ అభిమానుల్లో ఉత్సాహం పరవళ్లు తొక్కేలా చేస్తుందో... అదే పవర్ స్టార్ "పవన్ కళ్యాణ్". ఇప్పుడు "భీమ్లా నాయక్" రూపంలో తన నటనతో అభిమానులను ఉర్రూతలూగిస్తున్నారు పవర్ స్టార్.

“డిస్నీ ప్లస్ హాట్ స్టార్”లో అలరిస్తున్న భీమ్లా నాయక్..

"ఏ పేరు తలిస్తే అభిమానులు పండుగ చేసుకుంటారో... ఏ ఇమేజ్ అభిమానుల్లో ఉత్సాహం పరవళ్లు తొక్కేలా చేస్తుందో... అదే పవర్ స్టార్ "పవన్ కళ్యాణ్". ఇప్పుడు "భీమ్లా నాయక్" రూపంలో తన నటనతో అభిమానులను ఉర్రూతలూగిస్తున్నారు పవర్ స్టార్. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాలో టాలీవుడ్ టాల్ హీరో రానా దగ్గుబాటి మరో హీరోగా నటించారు.


“అహంకారానికి ఆత్మగౌరవానికి మధ్య జరిగే యుద్ధం..అహం దెబ్బతింటే అవసరమే ఆయుధం అవుతుంద”ని చెప్పే "భీమ్లా నాయక్" సినిమా తాజాగా డిజిటిల్ ప్లాట్ ఫామ్ “డిస్నీ ప్లస్ హాట్ స్టార్”లో స్ట్రీమింగ్ అవుతున్న నేపథ్యంలో నిజంగానే వ్యూయర్స్‌లో పండగ వాతావరణం నెలకొంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - రానా దగ్గుబాటి కలిసి మొదటిసారి స్క్రీన్ మీద నువ్వా - నేనా అంటూ పోటీ పడి నటించడం ఒక విశేషమైతే  మాటలలో ఎన్నో సంచలనాలు సృష్టించిన త్రివిక్రమ్ రచన  "భీమ్లా నాయక్" చిత్రాన్ని వేరే లెవెల్లో నిలబెట్టడం మరో ప్రత్యేకత.


ఇక ఈ సినిమాలో టాలెంటెడ్ హీరోయిన్స్ నిత్యా మేనన్ పవన్ సరసన నటించగా, సంయుక్త మేనన్ రానాకు జంటగా కనిపించింది. ఈ సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు అద్భుతమైన ఫ్లో లో సాగుతుంది. ఎక్కడా ప్రేక్షకులు రిలాక్స్ అయ్యే గ్యాప్ కూడా ఇవ్వకుండా మెస్మరైజింగ్ స్క్రీన్ ప్లేతో దర్శకుడు ఎంగేజ్ చేశాడు. ఈ సన్నివేసం తర్వాత ఏం జరుగుతుందో.. అనే విపరీతమైన ఆసక్తిని కలిగిస్తూ ఈ సినిమని తెరకెక్కించారు. ఇప్పటికే థియేటర్స్‌లో "బీమ్లా నాయక్" సినిమాని చూసిన వారు మళ్ళీ మళ్ళీ ప్రముఖ ఓటీటీ “డిస్నీ ప్లస్ హాట్ స్టార్”లో వీక్షిస్తున్నారు. థియేటర్స్‌లో చూడలేని వారు ఇప్పుడు మిస్ అవ్వకండి. అద్భుతమైన స్ట్రీమింగ్ అనుభూతి కోసం “డిస్నీ ప్లస్ హాట్ స్టార్”లో ఈ చిత్రాన్ని చూడండి. 

Updated Date - 2022-03-24T17:28:35+05:30 IST