ధోని కత్తి పట్టాడు.. తలలు తెగిపడుతున్నాయ్
ABN , First Publish Date - 2022-02-05T03:25:44+05:30 IST
జార్ఖండ్ డైనమెట్, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (ఎంఎస్.ధోని) సరికొత్త అవతారమెత్తారు. భారీ గ్రాఫిక్స్ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ‘అథర్వ: ద ఆరిజన్’ అనే గ్రాఫిక్ నవలలో సూపర్ హీరో పాత్రను

జార్ఖండ్ డైనమెట్, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (ఎంఎస్.ధోని) సరికొత్త అవతారమెత్తారు. భారీ గ్రాఫిక్స్ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ‘అథర్వ: ద ఆరిజన్’ అనే గ్రాఫిక్ నవలలో సూపర్ హీరో పాత్రను పోషిస్తున్నారు. యువ రచయిత రమేష్ తమిళ మణి నవల ఆధారంగా తెరకెక్కిస్తుండగా ఇందులో ధోనీ అతీతశక్తులతో అలరించనున్నారు. దీనికి సంబంధించిన మోషన్ పోస్టర్‌ను ధోనీ స్వయంగా ఆవిష్కరించారు. ఇందులో సినీ హీరోలకు ఏమాత్రం తీసిపోని విధంగా ధోని కనిపిస్తున్నారు.
అయితే, ఇప్పటివరకు క్రికెటర్‌గా మాత్రమే జనానికి తెలిసిన ధోని... ఇపుడు కత్తి పట్టుకుని తలలు నరుకుతుంటే చూడటం మాత్రం కొంచెం కొత్తగానే ఉంది. ఈ గ్రాఫిక్ నవల త్వరలోనే అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్‌కానుంది. ప్రీఆర్డర్ ద్వారా దీన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది. విర్జూ స్టూడియోస్, మిడాస్ డీల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనిపై ధోనీ మాట్లాడుతూ, ఇది నిజంగానే అద్భుతమైన వెంచర్. ఇందులో భాగమైనందుకు చాలా థ్రిల్‌గా ఉంది. ‘అథర్వ’ అనేది ఒక అద్భుతమైన కథ, లీనమయ్యే కళా కృతితో ఆకర్షణీయమైన గ్రాఫిక్ నవల అని వివరించారు.