సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Anand Devarakonda: ఆకట్టుకుంటున్న ‘హైవే’ ట్రైలర్..

ABN, First Publish Date - 2022-08-16T19:38:14+05:30

టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొడ (Anand Devarakonda) నటించిన లేటెస్ట్ మూవీ ‘హైవే’ (Highway). తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదలై ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. స్టార్ హీరో విజయ్ దేవరకొడ (Vijay Devarakonda)

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొడ (Anand Devarakonda) నటించిన లేటెస్ట్ మూవీ ‘హైవే’ (Highway). తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదలై ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. స్టార్ హీరో విజయ్ దేవరకొడ (Vijay Devarakonda) సోదరుడైన ఆనంద్ దేవరకొండ ‘దొరసాని’ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన సంగతి తెలిసిందే. మొదటి సినిమాతోనే పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొని మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత నటించిన 'మిడిల్ క్లాస్ మెలోడీస్', పుష్పక విమానం చిత్రాలతోనూ ఆకట్టుకున్నాడు.


ఈ క్రమంలో వచ్చిన సినిమానే ‘హైవే’. ఈ చిత్రానికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.వి. గుహన్ (K V Guhan) దర్శకత్వం వహించగా.. మానస రాధాకృష్ణ (Manasa Radhakrishna) హీరోయిన్‌గా నటించింది. వెంకట్ తలారి నిర్మాత. సయామీఖేర్, అభిషేక్ బెనర్జీ, జాన్ విజయ్, రేష్మా ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఆగస్టు 19 నుంచి ఈ చిత్రాన్ని తెలుగు ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను హీరో నాగశౌర్య రిలీజ్ చేశారు. 


ఆనంద్ దేవరకొండ ఇప్పటి వరకు నటించిన సినిమాలు రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు కాదు. ఇప్పుడు కూడా అలా విభిన్న కథాంశంతోనే వచ్చాడు. హైవేపై ట్రాక్ లో వెళుతూ కనిపించిన అమ్మాయిలని అతి కిరాతకంగా హత్యలు చేసే ఓ సైకో చుట్టూ చిత్ర కథ సాగుతుంది. తన సహాయం కోరిన ఓ అమ్మాయి సైకో బారిన పడిందా? అని వెతికే పాత్రలో ఆనంద్ దేవరకొండ నటించాడు. సైకో కిల్లర్ ని వెతికే పోలీస్ ఆఫీసర్ పాత్రలో సయామీ ఖేర్ కనిపించింది. మొత్తంగా ఈ ట్రైలర్ మొత్తం ఎంతో ఆసక్తికరంగా సాగింది. మరి ప్రేక్షకులను హైవే మూవీతో ఆనంద్ దేవరకొండ ఏమేరకు ఆకట్టుకుంటాడో చూడాలి.



Updated Date - 2022-08-16T19:38:14+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!