సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

అక్కినేని హీరో ఓటీటీ ఎంట్రీ..ఫస్ట్ లుక్ రిలీజ్

ABN, First Publish Date - 2022-03-18T17:44:15+05:30

అక్కినేని ఫ్యామిలీ నుంచి యంగ్ హీరో నాగ చైతన్య డిజిటల్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. లవ్ స్టోరి, బంగార్రాజు లాంటి వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న చైతూ తాజాగా 'దూత' అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అక్కినేని ఫ్యామిలీ నుంచి యంగ్ హీరో నాగ చైతన్య డిజిటల్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. లవ్ స్టోరి, బంగార్రాజు లాంటి వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న చైతూ తాజాగా 'దూత' అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు మరో అక్కినేని హీరో సుశాంత్ ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. 'కాళిదాసు' చిత్రంతో హీరోగా పరిచయమయిన సుశాంత్.. ఆ తర్వాత 'కరెంట్', 'అడ్డా', 'దొంగాట', 'ఆటాడుకుందాంరా' 'చి౹౹ల౹౹సౌ౹౹' లాంటి డిఫరెంట్ జోనర్ చిత్రాలతో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక గత చిత్రం 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' కూడా మంచి విజయం సాధించింది. 


ఈ క్రమంలోనే ఇప్పుడు సుశాంత్ ఓ ఆసక్తికరమైన కథాంశంతో మొదటిసారిగా వెబ్ సిరీస్‌లో నటిస్తున్నాడు. జీ 5 ఓటీటీ రూపొందిస్తున్న ఈ సిరీస్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. 'వరుడు కావలెను' ఫేమ్ లక్ష్మి సౌజన్య దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. కొల్లా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రవీణ్ కొల్లా నిర్మిస్తున్నారు. కాగా, నేడు (మార్చి 18) హీరో సుశాంత్ పుట్టినరోజు. ఈ సందర్భంగా తను నటిస్తున్న వెబ్ సిరీస్ నుంచి ఫస్ట్ లుక్‌ను వదిలారు. ఈ లుక్‌లో సుశాంత్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాడు. 

Updated Date - 2022-03-18T17:44:15+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!