వరల్డ్ డిజిటల్ ప్రీమియర్గా అఖండ

ABN , First Publish Date - 2022-01-22T17:41:26+05:30 IST

'వరల్డ్ డిజిటల్ ప్రీమియర్'గా "అఖండ" చిత్రం ఇప్పుడు 'డిస్నీ ప్లస్ హాట్ స్టార్'లో ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. మాస్ ప్రేక్షకుల్ని మెప్పించడంలో కథానాయకుడు నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీనుల

వరల్డ్ డిజిటల్ ప్రీమియర్గా అఖండ

'వరల్డ్ డిజిటల్ ప్రీమియర్'గా "అఖండ" చిత్రం ఇప్పుడు 'డిస్నీ ప్లస్ హాట్ స్టార్'లో ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. మాస్ ప్రేక్షకుల్ని మెప్పించడంలో కథానాయకుడు నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీనుల కాంబినేషన్ ఎంత సంచలనమో తాజాగా నిరూపించింది ఈ చిత్రం. నందమూరి బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో జగపతి బాబు, శ్రీకాంత్, ప్రజ్ఞ జైస్వాల్, పూర్ణ, సునీల్ శెట్టి ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు. ఈ సినిమాకి తమన్ అందించిన పాటలు, నేపధ్య సంగీతం గురించి చాలా మంచి పేరు వచ్చింది. కాగా, "అఖండ" సినిమా "వరల్డ్ డిజిటల్ ప్రీమియర్"గా "డిస్నీ ప్లస్ హాట్ స్టార్" ప్లాట్ ఫార్మ్ పై ఒక కొత్త అనుభూతిని ఇవ్వబోతోంది. 

Updated Date - 2022-01-22T17:41:26+05:30 IST