Ajith: మరో రికార్డ్ సెట్ చేసిన 'వలిమై'..
ABN , First Publish Date - 2022-03-27T14:09:02+05:30 IST
కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ హీరోగా.. హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా 'వలిమై' గత నెల 24న విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. జీ స్టూడియోస్, బోని కపూర్లు సంయుక్తంగా

కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ హీరోగా.. హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా 'వలిమై' గత నెల 24న విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. జీ స్టూడియోస్, బోని కపూర్లు సంయుక్తంగా నిర్మించిన ఇందులో హ్యుమా ఖురేషీ, కార్తికేయ ముఖ్య పాత్రల్లో నటించారు. భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ మూవీ మార్చి 25 నుంచి ప్రముఖ ఓటీటీ జీ5 ద్వారా స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలోకి వచ్చిన కేవలం 24 గంటల్లోనే వలిమై చిత్రం 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌ని పూర్తి చేసుకుంది. జీ5లో ఇది బిగ్గెస్ట్ ఓపెనింగ్ అంటున్నారు. ఇందులో అజిత్ కుమార్ ఐపీఎస్ ఆఫీసర్ అర్జున్ పాత్రలో నటించారు. యువన్ శంకర్ రాజా సంగీత దర్శకుడు.