సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

‘రాజా విక్రమార్క’ వెనుక అంత కథుంది!

ABN, First Publish Date - 2022-07-10T06:55:32+05:30

మెగాస్టార్‌ చిరంజీవి, అమల కలసి నటించిన ఏకైక చిత్రం ‘రాజా విక్రమార్క’. ఈ సినిమాలో రాధిక మరో కథానాయికగా నటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెగాస్టార్‌ చిరంజీవి, అమల కలసి నటించిన ఏకైక చిత్రం ‘రాజా విక్రమార్క’. ఈ సినిమాలో రాధిక మరో కథానాయికగా నటించారు. 1989 ఆగస్టు 7న బెంగళూరులో ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. ఆ సమయంలో బెంగళూరులోనే ‘శాంతి-క్రాంతి’ చిత్రం షూటింగ్‌లో ఉన్న తమిళ చిత్రరంగ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ముఖ్య అతిధిగా విచ్చేసి, తొలి క్లాప్‌ ఇచ్చారు. ఈ చిత్రనిర్మాణ సమయంలోనే చిరంజీవి తన తొలి హిందీ చిత్రం ‘ప్రతిబంధ్‌’  చేయాల్సి వచ్చింది. ‘రాజా విక్రమార్క’ సినిమా కోసం ఇచ్చిన డేట్స్‌లోనే ఆ సినిమా చేయాల్సిన పరిస్థితి ఏర్పడడంతో ఎలా అని చిరంజీవి ఆలోచనలో పడితే, ‘నా సినిమా లేట్‌ అవుతుందనే ఆలోచన మీ మనసులోకి రానివ్వవద్దు. మీరు హిందీ ఫీల్డ్‌కు వెళ్లడం మా అందరికీ గర్వకారణం’ అని నిర్మాత అమరనాథ రెడ్డి చెప్పి, తనకు ఇచ్చిన డేట్స్‌ వదులుకున్నారు. అలా ‘రాజా విక్రమార్క’ కోసం కేటాయించిన డేట్స్‌లోనే ‘ప్రతిబంధ్‌’ చిత్రం చేశారు చిరంజీవి. ‘రాజా విక్రమార్క’ దర్శకుడు రవిరాజా పినిశెట్టే ‘ప్రతిబంధ్‌’కు దర్శకత్వం వహించడం గమనార్హం. చిరంజీవి హిందీ చిత్రం ప్రారంభం కావడం, అమల అమెరికాకు, రాధిక లండన్‌కు వెళ్లడం.. ఇత్యాది కారణాల వల్ల 1989లో ప్రారంభమైన ఈ చిత్రం 15 నెలల తర్వాత కానీ విడుదల కాలేదు. సరికొత్త బ్యాక్‌డ్రా్‌పలో భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఆశించిన విజయం సాధించలేదు.

Updated Date - 2022-07-10T06:55:32+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!